ముఖ్య అతిథిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి. ఘనంగా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమం

0
400

ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నెహ్రూ యువ కేంద్రం, మరియు తెలంగాణ గిరిజన సంక్షేమ నివాస మహిళా డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మి గారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.అభివృద్ధి చెందిన భారతదేశం సాకారం కావాలంటే యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆమె పేర్కొన్నారు. మద్యం, డ్రగ్స్, తంబాకు వంటి అలవాట్లు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని, విద్యార్థులు చదువునే తమ నిజమైన నషాగా (వ్యసనంగా) మార్చుకోవాలని పిలుపునిచ్చారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరుతు గిరిజన బాలికల విద్యకు తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆసిఫాబాద్ డీఎస్పీ శ్రీ అశోక్, డీఆర్‌పీ శ్రీ రాథోడ్ నరేష్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి డి. శారద, మరియు బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ రవికుమార్ గారు పాల్గొని విద్యార్థులకు మార్గదర్శనం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కథానాయకుడిగా, ప్రజానాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం సొంతం చేసుకున్న మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
కథానాయకుడిగా, ప్రజానాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం సొంతం చేసుకున్న మహనీయుడు శ్రీ...
By Chennaiah Kati 2026-01-18 07:08:21 0 266
SURAKSHA
AP Police Blood Donation Drive Saves 200 Patients Lives
కర్నూలులో ఏపీ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. 'పోలీస్ విత్ పీపుల్' నినాదంతో నిర్వహించిన రక్తదాన...
By Kalaga Sailaja 2026-07-01 05:26:23 0 251
SURAKSHA
​ సైబర్ నేరాల కట్టడి: డిజిటల్ భద్రత
మారుతున్న కాలంతో పాటు పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు అత్యాధునిక...
By Kalaga Sailaja 2026-06-26 06:32:56 0 90
Andhra Pradesh
తప్పుడు కధనాలు ప్రచురించిన పత్రికలపై చర్యలు తీసుకోవాలి:గిరిజనులు
బొబ్బిలి మండలం డొంగురువలస గిరజనగ్రామంలో రామాలయం ఎదుటనున్న పాకను తొలగించి,మా గిరిజనులపై తప్పుడు...
By Boiena Rajesh 2026-06-09 16:48:11 0 435
Telangana
ఎవరికి చెమటలు పట్టకుండా, రైతుల కష్టాలు తెలుసుకుందాం!
అంత ప్రీమియం బస్సు లో పోతేనే రైతుల కష్టాలు తెలుస్తాయి అన్నమాట. ‎అయినా వీళ్ళు పోయే ఊర్లో...
By Ponnala Srinivasrao 2026-05-27 03:51:53 0 164
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com