కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ మెగా ఆపరేషన్. నెల రోజుల్లో 74 మంది బాల కార్మికులకు విముక్తి

0
367

🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి,జగదీష్,: ఆసిఫాబాద్:కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్-XII ప్రత్యేక డ్రైవ్ విజయవంతంగా ముగిసింది. జూలై 1వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు నెల రోజుల పాటు సాగిన ఈ ప్రత్యేక ఆపరేషన్ వివరాలను జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ అధికారికంగా వెల్లడించారు.మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, స్వచ్ఛంద సంస్థల (NGOs) సమన్వయంతో జిల్లా పోలీస్ యంత్రాంగం క్షేత్రస్థాయిలో విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. జిల్లాలోని వివిధ హోటళ్లు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలపై జరిపిన ఈ దాడుల్లో మొత్తం 74 మంది బాల కార్మికులను సురక్షితంగా రక్షించారు.డివిజన్ల వారీగా ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలో 38 మంది, కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలో 36 మంది చిన్నారులకు విముక్తి కల్పించారు. రక్షించబడిన వారిలో 71 మంది బాలురు, ముగ్గురు బాలికలు ఉన్నారు. వీరినందరినీ సంరక్షణ నిమిత్తం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ఎదుట హాజరుపరిచారు.చట్టాన్ని ఉల్లంఘించి 18 సంవత్సరాల లోపు మైనర్ పిల్లలతో పనులు చేయిస్తున్న వివిధ సంస్థల యజమానులపై పోలీసులు కఠిన చర్యలు Criminal చర్యలు చేపట్టారు. ఈ డ్రైవ్‌లో నిబంధనలు మీరిన యజమానులపై చట్టప్రకారం 07 క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ నితికా పంత్ మాట్లాడుతు. బాలల హక్కుల పరిరక్షణ సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యతని, చిన్న పిల్లలను పనుల్లో పెట్టుకుంటే చట్టప్రకారం కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1098 లేదా డయల్ 100 కి సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఈ డ్రైవ్‌ను విజయవంతం చేసిన పోలీస్ సిబ్బందిని, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులను ఆమె అభినందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
తట్టివారిపల్లె చెరువు వద్ద వ్యక్తి అనుమానాస్పద మృతి.
మదనపల్లె మండలం తట్టివారిపల్లె చెరువు వద్ద ఆదివారం ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు....
By Pagadala Venkateswar 2026-04-12 04:39:26 0 159
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ : ఈతకు వెళ్లి వ్యక్తి మృతి
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో ఆదివారం పెద్ద ఉప్పరపల్లి బలిజ వీధికి చెందిన మునిరెడ్డి (40)...
By Kothuru Murali 2026-04-06 07:11:04 0 193
Telangana
గర్భిణి ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం ఆసిఫాబాద్‌లో యువకుడి మానవత్వం
🎤ఆసిఫాబాద్, (భారత్ ఆవాజ్ న్యూస్): ఆపదలో ఉన్న ఒక గర్భిణి ప్రాణాలను కాపాడేందుకు ఒక యువకుడు సకాలంలో...
By Chunarkar Jagadeesh 2026-09-13 15:27:11 0 164
Andhra Pradesh
వాల్మీకిపురం: గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం.
వాల్మీకిపురం ఎస్సై తిప్పేస్వామి తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం కొత్తపల్లి చెరువులో స్నేహితులతో...
By Pagadala Venkateswar 2026-04-30 04:24:56 0 137
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com