Madanapalle: ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచనతో 34వ వార్డులో కూటమి నేతల డోర్ టు డోర్ ప్రచారం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ, సమస్యల పరిష్కారానికి హామీ.

0
104

34వ వార్డులో డోర్ టు డోర్ ప్రచారం.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించిన కూటమి నాయకులు

 

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా సూచనలతో శుక్రవారం మదనపల్లె మున్సిపాలిటీ 34వ వార్డులోని 105వ బూత్ పరిధిలో డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. 34వ వార్డు ఇన్‌చార్జి బాలమలి శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తోందని, ప్రజలకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. అలాగే ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొండయ్య, మల్లికార్జున, రాఘవ, విశ్వనాథ్‌తో పాటు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకులు,

Search
Categories
Read More
Telangana
మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం.
కొన్ని పురాణగాథలు కొన్ని రోజులను పండుగలుగా మార్చాయి. కొన్ని జాతీయ సంఘటనలు ఆ సమాజానికి పర్వదినాలు...
By Ponnala Srinivasrao 2026-05-01 03:06:43 0 165
Andhra Pradesh
కిష్టవరం టోల్గేట్ వద్ద కిలోమీటర్ మేర భారీగా వాహనాలు , పట్టించుకోకుండా సర్వర్ ఇష్యూ అంటూ సిబ్బంది, ఎన్ని రోజులు ఈ అగపాట్లు అంటూ ప్రయాణికులు!
కిర్లంపూడి,కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్గేటు వద్ద గురువారం కిలోమీటర్ల కొద్దీ వాహనాల రద్దీ ఉండడం,...
By Nandika Jayababu 2026-04-30 18:49:59 0 566
Uttarkhand
Uttarakhand Advances Renewable Energy and Hydropower
Uttarakhand continues to expand its renewable energy sector by promoting hydropower, solar...
By Fathima Safa 2026-06-27 06:47:51 0 73
Andhra Pradesh
గిద్దలూరు నియోజకవర్గ విద్యాభివృద్ధిలో మరో కీలక అడుగు
గిద్దలూరు నియోజకవర్గ విద్యాభివృద్ధిలో మరో కీలక అడుగు మన నియోజకవర్గంలో నూతన ప్రభుత్వ జూనియర్...
By Chennaiah Kati 2026-07-03 16:47:57 0 105
Telangana
పాలేరులో మద్యం దందా.. బెల్ట్ షాపుల్లో ధరల మోత
పాలేరు నియోజకవర్గంలో మద్యం విక్రయాలు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నాయి. వైన్స్లలో దొరకని...
By Krishna Balina 2026-02-10 07:28:15 0 974
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com