Madanapalle: మదనపల్లె ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషాను నాయీ బ్రాహ్మణ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు.

0
106

Madanapalle: మదనపల్లె శాసనసభ్యులు శ్రీ మహమ్మద్ షాజహాన్ బాషాను నాయీ బ్రాహ్మణ నాయకులు శుక్రవారం కలిసి తమ వృత్తికి సంబంధించిన పలు సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయీ బ్రాహ్మణ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలోని నాయీ బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావించాలని ఎమ్మెల్యేను కోరారు.

 

ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్పొరేట్ సెలూన్ల కారణంగా స్థానిక నాయీ బ్రాహ్మణుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందని తెలిపారు. మదనపల్లె నియోజకవర్గంలో తరతరాలుగా క్షవర వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేక విధానం రూపొందించాలని, యువతకు ఆధునిక సెలూన్ల ఏర్పాటు కోసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు సబ్సిడీ రుణాలు అందించాలని, ఆధునిక పరికరాలు, సెలూన్ ఇంటీరియర్, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం ప్రత్యేక ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని వినతిపత్రంలో కోరారు.

 

ఈ కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ నాయకులు మంగళ ప్రభాకర్, బుర్ర రంగస్వామి, యనమల రామకృష్ణ, ముస్తూరి మంజునాథ్, వేంపల్లి శంకర్, కన్నెమడుగు సూర్యనారాయణ, తనకంటి మంజునాథ్, యోగేంద్ర, భజంత్రి ఈశ్వర్, భజంత్రి నాగరాజ్, పుట్టపర్తి పాండు, భజంత్రి శివకుమార్, నారప్పగారి పాండు, పుట్టపర్తి రాజు, విష్ణు, కన్నెమడుగు మనోహర్, గుండ్లూరి నవీన్, రామాంజులు, ప్రసాద్, హరీష్, లుక్స్ గంగాధర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణం లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
గురువారం సాయంత్రం అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పుంగనూరులోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి...
By Kothuru Murali 2026-02-13 06:15:13 0 188
Andhra Pradesh
Tirumala: తిరుమలలో రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు.
    Tirumala: తిరుమలలో రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు 19-01-2026 Mon 18:28 | Andhra...
By Pagadala Venkateswar 2026-01-19 16:42:15 0 253
Andhra Pradesh
కలెక్టరేట్ వద్ద పోలీసుల తీరుపై సిపిఎం ఆగ్రహం.
అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో ప్రజలు తమ సమస్యలను అధికారులకు విన్నవించుకోవడానికి కలెక్టరేట్ కు...
By Pagadala Venkateswar 2026-02-28 06:40:53 0 194
Andhra Pradesh
రొంపిచర్ల: మోడల్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
రొంపిచర్ల AP మోడల్ స్కూల్లో 2026-27లో ఆరో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు...
By Kothuru Murali 2026-02-21 08:29:11 0 196
Andhra Pradesh
రేపు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఏర్పాట్లు పరిశీలన
రేపు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన - ఏర్పాట్ల పరిశీలన వెలుగొండ...
By Chennaiah Kati 2026-06-26 16:47:42 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com