ఆప్త మిత్రున్ని కోల్పోయా.. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ తీవ్ర విచారం

0
157

తెలంగాణ ఉద్యమ కారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతితో వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన సంతాపాన్ని ప్రకటించారు.

‎తెలంగాణ ఉద్యమ కారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతితో వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన సంతాపాన్ని ప్రకటించారు. ఉద్యమ సహచరున్ని, ఆప్త మిత్రున్ని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్ది మరణం పట్ల కేసీఆర్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.

‎తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ పోరాటంలో, వరంగల్ జిల్లా ఉద్యమంలో, తనతోపాటు కలిసి నడిచిన జ్జాపకాలను కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పెద్దిని బతికించుకోవడానికి పార్టీ చేసిన విశ్వప్రయత్నాలూ, డాక్టర్లు చేసిన కృషీ విఫలం కావడం పట్ల కేసీఆర్ మనోవేదనను వ్యక్తం చేశారు. తెలంగాణనే శ్వాసగా, నీతి నిజాయితీతో ప్రజాజీవనం కొసాగిస్తూ సాగించిన రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయమని అన్నారు.

‎పోరాటాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట గడ్డపై బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగురవేసి, మొక్కవోని ధైర్యంతో ఉద్యమించిన ధీరుడు సుదర్శన్ రెడ్డి అని కేసీఆర్ కొనియాడారు. ఉద్యమకాలం నుంచి చివరిశ్వాస వరకూ గులాబీ జెండా నీడలో, పార్టీ అడుగుజాడల్లో నడిచిన పెద్ది, అటు పోరాటంలోనూ, ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నాడని తెలిపారు. పార్టీ పట్ల అత్యంత విధేయతో పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పార్టీకి తీరని లోటని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

‎పోలీసు ఒత్తిళ్లు, నాన్-బెయిలబుల్ కేసులు, జైలు నిర్బంధాలకు కూడా లొంగని పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమ పటిమ, ధైర్య సాహసాలు, స్ఫూర్తి, ఆయన చేసిన సేవలు నియోజకవర్గ కార్యకర్తలు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసుకుంటాయని అన్నారు. పెద్దిని కోల్పోయి శోక తప్త హృదయులైవున్న ఆయన భార్యాపిల్లలకు పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని అధినేత సూచించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, పెద్ది కుటుంబ సభ్యులకు, నియోజకవర్గ కార్యకర్తలు అభిమానులకు, కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Search
Categories
Read More
SURAKSHA
How to protect yourself from online investment fraud today
To avoid online investment fraud, remain vigilant against 'get-rich-quick' schemes promising...
By Kalaga Sailaja 2026-06-24 07:35:52 0 174
Telangana
భద్రాచలం లో ఉత్తరా ద్వారా దర్శనం
భద్రాచలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైకుంఠ ఏకాదశి సందర్భంగా. ఉత్తర ద్వారా దర్శనం నిర్వహిస్తోంది....
By Karapati Gopi 2025-12-30 01:19:10 0 325
Andhra Pradesh
ఏపీలో కీలక రహదారికి కేంద్రం నిధులు మంజూరు.. గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో...
By Pagadala Venkateswar 2026-08-26 06:22:17 0 83
Andhra Pradesh
మదనపల్లి: ప్రభుత్వ ప్రణాళికలకు జనగణనే ప్రాతిపదిక: కలెక్టర్.
ప్రభుత్వ విధానాల రూపకల్పనకు, సంక్షేమ పథకాల అమలుకు ఖచ్చితమైన జనగణన గణాంకాలే బలమైన పునాది అని...
By Pagadala Venkateswar 2026-02-28 06:28:14 0 165
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె మండలం పొన్నూటిపాళెంలో ఒకరి అభ్యంతరం కారణంగా 89 రైతు కుటుంబాలకు పాస్‌పుస్తకాలు అందడంలో జాప్యం జరుగుతోంది.
Madanapalle: మదనపల్లె మండలం పొన్నూటిపాళెం గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 42-2, 43-2, 45, 49లలో...
By Pagadala Venkateswar 2026-08-06 06:32:44 0 102
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com