Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె సంతబజార్ అన్న క్యాంటీన్‌లో నిర్వహణ లోపాలపై టీడీపీ నేత రేగడి ప్రసాద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.

0
96

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని సంతబజార్ 22వ వార్డులో ఉన్న అన్న క్యాంటీన్‌లో నేమ్ బోర్డు సరిగా వెలగకపోవడం, ప్రాంగణంలోని కొన్ని లైట్లు పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, 22వ వార్డు అధ్యక్షులు రేగడి ప్రసాద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజల కోసం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అన్న క్యాంటీన్ పథకం ద్వారా కేవలం ₹5కే భోజనం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. అయితే నిర్వహణలో లోపాల కారణంగా ప్రజల్లో ప్రభుత్వ పథకంపై ప్రతికూల అభిప్రాయం ఏర్పడే పరిస్థితి నెలకొనకూడదన్నారు. కాంట్రాక్టర్, మున్సిపల్ అధికారులు బాధ్యతలను ఒకరిపై ఒకరు నెట్టకుండా వెంటనే స్పందించి, నేమ్ బోర్డు పూర్తిస్థాయిలో వెలిగేలా చర్యలు తీసుకోవాలని, పనిచేయని అన్ని లైట్లను మరమ్మతు చేయాలని లేదా కొత్తవాటితో మార్చాలని కోరారు.

Search
Categories
Read More
Sikkim
A Historic Seat on the Brahmaputra Board Secure
In a significant administrative breakthrough for the state’s water security, Sikkim has...
By Dunna Jessicaruth 2026-05-20 09:56:13 0 215
Telangana
మంచిర్యాల: గుప్త నిధులకు కోసం తవ్వకాలు..
ఎసిసి క్వారీ దుర్గాదేవి ఆలయం వద్ద గుప్త నిధులు తవ్వకాలు జరిపిన ఇద్దరినీ సోమవారం అరెస్టు చేసినట్లు...
By Bonagiri RaviShankar 2026-06-23 04:30:48 0 252
Andhra Pradesh
బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం కృషిచేసిన ఎర్రం నాయుడు
*ప్రచురణార్థం* *23-02-2026*     *బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన...
By Rajini Kumari 2026-02-23 10:33:02 0 204
SURAKSHA
విశాఖపట్నంలో ఏపీ పోలీసులు చేపట్టిన కమ్యూనిటీ కిచెన్ సేవా కార్యక్రమ వివరాలు ఇక్కడ ఉన్నాయి:
విశాఖపట్నంలో ఏపీ పోలీసులు ప్రతిరోజూ 1,000 మంది నిరుపేదలకు ఉచిత భోజనాన్ని అందిస్తున్నారు....
By Kalaga Sailaja 2026-07-01 05:55:00 0 147
SURAKSHA
Jamjam Syamala Rao, IAS: Driving Excellence in Governance
A Distinguished Civil Servant Advancing Transparent Administration, Inclusive Development, and...
By Lokeshwari Panthadi 2026-07-13 05:39:58 0 166
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com