భారీ వర్షాలు కుమురం భీం ఆసిఫాబాద్ పోలీస్ శాఖ హై అలర్ట్. రంగంలోకి ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్

0
380

🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ): గత కొన్ని రోజులుగా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగంతో పాటు పోలీస్ శాఖ పూర్తిగా అప్రమత్తమైంది. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు విపత్తు సమయాల్లో ప్రజల ప్రాణాలను రక్షించడమే ప్రథమ కర్తవ్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది. జిల్లా వ్యాప్తంగా వరద తీవ్రత పెరుగుతుండటంతో జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ గారు స్వయంగా క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షిస్తూ సిబ్బందిని హై అలర్ట్ చేశారు. వరద ముప్పు పొంచి ఉన్న లోతట్టు ప్రాంతాలు మరియు వాగుల వద్ద తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా పోలీస్ శాఖ భారీగా అత్యవసర రక్షణ పరికరాలను సిద్ధం చేసింది. విపత్తు నిర్వహణలో భాగంగా వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ బోట్లు, ప్రాణ రక్షణ కోసం పెద్ద సంఖ్యలో లైఫ్ జాకెట్లు మరియు లైఫ్ బాయ్స్ రక్షణ వలయాలు, సహాయక చర్యల కోసం బలిష్టమైన తాళ్లు, రాత్రి వేళల్లో ఉపయోగపడేలా టార్చ్ లైట్లు, ప్రమాదకర ప్రాంతాల్లో రాకపోకలను నియంత్రించడానికి బారికేడ్లు, అలాగే ప్రజలను అప్రమత్తం చేయడానికి మైక్ సెట్లను రెస్క్యూ టీమ్‌లకు అందుబాటులో ఉంచారు. జిల్లాలోని లో-లెవెల్ వంతెనలు, ప్రమాదకరమైన వాగులు మరియు వంకల వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది ఆయా ప్రాంతాలలో నిరంతరం విధుల్లో ఉంటూ పహారా కాస్తున్నారు. ప్రజలు వరద ఉధృతిని అంచనా వేయకుండా వంతెనలు దాటడానికి ప్రయత్నించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ గారు మాట్లాడుతూ ప్రజలందరూ పోలీస్ మరియు ప్రభుత్వ అధికారిక హెచ్చరికలను తప్పకుండా పాటించాలని కోరారు. భారీ వర్షాల సమయంలో ఒక చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చునని, కాబట్టి అనవసర ప్రయాణాలు మానుకొని ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర సహాయం లేదా సమాచారం కోసం ప్రజలు పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 100, కలెక్టరేట్ ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్ 18005991200, ఫైర్ అండ్ రెస్క్యూ నెంబర్ 101 లేదా మెడికల్ ఎమర్జెన్సీ నెంబర్ 108 ద్వారా తక్షణమే సంప్రదించాలని స్పష్టం చేశారు.

Search
Categories
Read More
SURAKSHA
Architect of Grassroots Change: Shri Anant Jain, IAS
From Engineering Precision to District Administration: How an IIT-Trained Strategist is Reshaping...
By Kalaga Sailaja 2026-07-31 08:27:26 0 185
Tamilnadu
Tamil Nadu Advances Digital Governance and Citizen Services
Tamil Nadu continues to expand digital governance by enhancing online public services and...
By Fathima Safa 2026-07-06 05:43:07 0 92
SURAKSHA
Rupin Sharma: Leading Nagaland Police with Integrity
A distinguished 1992-batch IPS officer of the Nagaland cadre, Shri Rupin Sharma serves as the...
By Lokeshwari Panthadi 2026-07-23 07:25:23 0 160
Andhra Pradesh
పుంగనూరు: వైసీపీ ఆవిర్భావ వేడుకలో పెద్దిరెడ్డి
పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం 16వ...
By Kothuru Murali 2026-03-13 03:47:30 0 185
Andhra Pradesh
అంబేద్కర్ జయంతి సందర్భంగా చీరాల మ్మెల్యే ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
టిటిడి కళ్యాణ మండపం నుండి ర్యాలీ గా వెళ్లి ముక్కోనపు పార్కు, పేరాల ఈపురుపాలెం తోటవారిపాలెం...
By Vadlamudi NagaVenkat 2026-04-14 11:55:24 0 240
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com