గిరిజనుల భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదు ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్

0
416

🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్  ప్రతినిధి జగదీష్): కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలం పోతేపల్లి గ్రామ శివారులో గిరిజన పోడు రైతుల సమస్యలపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజన రైతులను అటవీ శాఖ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ పర్యటన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ గారు స్వయంగా ట్రాక్టర్ పై ఘటనా స్థలానికి చేరుకుని, గిరిజన రైతులతో కలిసి అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా అటవీ, రెవెన్యూ అధికారులతో ఎమ్మెల్సీ దండే విఠల్ గారు ప్రత్యక్షంగా చర్చలు జరిపారు. తరతరాలుగా సాగు చేసుకుంటూ బతుకుతున్న గిరిజనుల హక్కులను కాలరాసే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టరాదని అధికారులను గట్టిగా హెచ్చరించారు. గిరిజనుల జీవనాధారమైన పోడు భూముల విషయంలో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, రైతులను బెదిరించడం, వ్యవసాయం చేసుకోకుండా అడ్డుకోవడం తగదని స్పష్టం చేశారు.అనంతరం ఎమ్మెల్సీ దండే విఠల్ గారు మాట్లాడుతూ. గిరిజనుల హక్కులను కాపాడటం కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత. గిరిజనుల భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదు. వారి సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ఏ స్థాయిలోనేనా పోరాటం చేస్తాం. పోడు రైతులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తాం అని స్పష్టం చేశారు.ఎమ్మెల్సీ జోక్యంతో అటవీ, రెవెన్యూ అధికారులు సానుకూలంగా స్పందించి, గిరిజన రైతులు తమ పోడు భూముల్లో వ్యవసాయం కొనసాగించేలా చర్యలు తీసుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యను స్వయంగా పరిశీలించి, అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గం చూపిన ఎమ్మెల్సీ దండే విఠల్ గారికి గిరిజన రైతులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజన రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీఎస్ఆర్టీసీ కి అవార్డు రావడం సంతోషం మంత్రి మండిపల్లి
రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీకి డిజిటల్...
By Benguluri Madhubabu 2026-01-17 07:39:00 0 341
Telangana
పర్యావరణ పరిరక్షణలో భాగంగా గణపతి మట్టి విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమం
వినాయక చవితి సందర్భంగా తేదీ 12/09/2026 రోజున కరీంనగర్ 48వ డివిజన్లో రైస్ మిల్లు వద్ద ఉదయం 9.30...
By Thalakokkula Sadanandam 2026-09-11 15:35:55 0 106
SURAKSHA
Sentinel of Integrity: Dr. Arshinder Singh Chawla
Unyielding Integrity: How Dr. Arshinder Singh Chawla’s Visionary Leadership is Redefining...
By Kalaga Sailaja 2026-07-20 05:58:10 0 84
Bharat Aawaz
🛑 The Shadow of Statelessness: Illegal Deportations & Citizenship Rights in India
In a country built on the values of democracy, dignity, and constitutional...
By Citizen Rights Council 2025-07-07 11:47:16 0 2K
Andhra Pradesh
పారిశ్రామిక కేంద్రంగా జగ్గయ్యపేటకు మహర్దశ
10.04.26 ప్రచురుణార్ధం                   ...
By Rajini Kumari 2026-04-10 12:12:07 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com