ఆసిఫాబాద్‌లో వైభవంగా బౌద్ధ సాంప్రదాయ వర్ష వాస్ ప్రారంభోత్సవం

0
376

ఆసిఫాబాద్, జూలై 28: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్షా భూమిలో బౌద్ధ సాంప్రదాయ వర్ష వాస్ (వర్షావాసం) కార్యక్రమం రేపు సాయంత్రం 5 గంటలకు ఘనంగా ప్రారంభం కానుంది. పూజ్య భంతే భరత్వాజ్ గారి పవిత్ర సమక్షంలో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి బౌద్ధ ఉపాసి ఉపాసకులతో పాటు మహిళలు కూడా అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ నెల 29న ప్రారంభమయ్యే ఆషాఢ పౌర్ణమి నుండి అశ్విని పౌర్ణమి వరకు మూడు నెలల పాటు బౌద్ధులు ఎంతో పవిత్రంగా ఈ వర్ష వాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని, ఈ కాలంలో ప్రతిరోజు బౌద్ధ విహార్‌లో ఏదో ఒక పవిత్ర గ్రంథాన్ని పఠించడం జరుగుతుందని వివరించారు. బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందిన తర్వాత సారనాథ్‌లోని ఇసిక వనంలో పంచ వర్గీయ భిక్షువులకు తన తొలి ఉపదేశాన్ని బోధించారని, దీనినే 'ధమ్మ చక్ర ప్రవర్తన్ దివస్' అని అంటారని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సెంటర్ కమిటీ అధ్యక్షులు మసాడే ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రశాంత్, స్టీరింగ్ కమిటీ అధ్యక్షులు యశ్వంత్, కోశాధికారి దుర్గం అనిల్, కౌన్సిలర్ వినోద్, జాడే కృష్ణజీ, సెంటర్ కమిటీ సభ్యులు దుర్గం పురుషోత్తం, కట్కర్ అజిత్, లోహాజీ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Bharat Aawaz
Building The Future Together!
Building The Future Together! BMA not just an Association—it’s a...
By Bharat Aawaz 2025-07-05 05:30:11 0 1K
Andhra Pradesh
మదనపల్లెలో భవన నిర్మాణం మేస్త్రి అదృశ్యం.
మదనపల్లె పట్టణంలోని ఎస్బీఐ కాలనీకి చెందిన భవన నిర్మాణ మేస్త్రి సోమశేఖర్ శుక్రవారం నుంచి...
By Pagadala Venkateswar 2026-03-15 12:24:16 0 202
Telangana
సిరోల్ మండల కేంద్ర శివారులో రోడ్డు ప్రమాదం.
మహబూబాబాద్ జిల్లా: స్కూటీ, బైక్ డీ.. ఆరుగురుకి తీవ్ర గాయాలు..ఇద్దరి పరిస్థితి విషమం.....
By Bheeshman King 2026-04-10 11:27:28 0 248
Telangana
పెద్దపల్లి మార్కెట్ యార్డులో మక్కలు చోరీ...!
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విఎస్, ఎమ్మెల్యే...
By Sunka Santhosh 2026-05-07 03:57:42 0 171
Andhra Pradesh
పోలీసుల ప్రమాదంపై చిన్నశ్రీను దిగ్భ్రాంతి
గాజులరేగలో రూరల్ పోలీసుల వాహనం ప్రమాదానికి గురైన ఘటనపై జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు...
By Boiena Rajesh 2026-08-23 13:07:41 0 83
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com