కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి విక్రేతలపై పోలీసుల ఉక్కుపాదం. తిర్యాణిలో 9 మంది ముఠా అరెస్ట్

0
291

🎤కుమురం భీం అసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యప్తంగా మత్తు పదార్థాల నియంత్రణకు పోలీస్ శాఖ తనిఖీలు ముమ్మరం చేసింది. జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, అసిఫాబాద్ డీఎస్పీ అశోక్ పర్యవేక్షణలో తిర్యాణి పోలీసులు శనివారం నిర్వహించిన ప్రత్యేక పెట్రోలింగ్‌లో గంజాయి ముఠా గుట్టు రట్టయింది.రోడ్లపై అనుమానాస్పదంగా తిరుగుతున్న 9 మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, వారు గంజాయి సేవించడమే కాకుండా వివిధ గ్రామాల్లో విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. నిందితుల నుండి చట్టప్రకారం 170 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి వారిని రిమాండ్‌కు తరలించారు.మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఎలాంటి రాజీ లేదని, నిఘా నిరంతరం కొనసాగుతుందని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ప్రజలు తమ పరిసరాల్లో ఇలాంటి కార్యకలాపాలు గమనిస్తే వెంటనే డయల్ 100 కి లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మత్తు పదార్థాలకు నో చెప్పండి - సురక్షిత సమాజాన్ని నిర్మించండి అని పిలుపునిచ్చారు 

Search
Categories
Read More
Andhra Pradesh
చింతచెట్టు పైనుంచి పడి యువకుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో మంగళవారం, గంగన్నగారిపల్లికి చెందిన రవి (38) అనే యువకుడు నిమ్మనపల్లి రోడ్డులోని...
By Pagadala Venkateswar 2026-03-10 08:47:12 0 314
BMA
Climate Reporting: Journalists Facing Extreme Heatwaves
Field reporters documenting India’s intensifying environmental crises, from 50-degree...
By JoinBMA 2026-08-21 08:07:06 0 213
Meghalaya
Meghalaya Strengthens Law and Order Across the State
Meghalaya continues to reinforce its law and order framework through police modernization,...
By Fathima Safa 2026-07-03 16:16:08 0 90
Telangana
నిజామాబాద్: బైక్ లో మంటలు తపినా ప్రమదం
రోడ్‌పై వెల్టునాసమాయంలో అకాస్మతుగా ధ్వీచక్ర వాహనం లో మంటలుచెలారెగి వాహనం దగ్ధమైన ఘట్టానా...
By Sadaq Sadaq 2026-04-07 18:11:09 0 212
Telangana
Hyderabad Rain Alert 🌧️భాగ్యనగరంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి |
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షం ఉదృతికి...
By Bharat Aawaz 2025-09-20 08:20:04 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com