"నా శాఖలో ఏం జరుగుతుందో పత్రికల్లో చూసి తెలుసుకోవాలా?"

0
170

ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియకుండానే పౌర సరఫరాల శాఖలో విజిలెన్స్ ఎంక్వైరీ చేయించిన రేవంత్ రెడ్డి

‎తన ప్రతిష్ఠ దెబ్బతీయడానికే రేవంత్ కుట్ర చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం

‎తెలంగాణ పౌర సరఫరాల శాఖలో ధాన్యం టెండర్ల రద్దుపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియకుండానే నిన్న విజిలెన్స్ విచారణ జరగడం చర్చనీయాంశంగా మారింది

‎మీడియాలో, పత్రికల్లో చూశాకే తనకు విషయం తెలిసిందని సన్నిహితుల వద్ద మంత్రి ఆవేదన

గత ఖరీఫ్ సీజన్‌లో సేకరించిన ధాన్యంలో రాష్ట్ర అవసరాలకు మిగుల్చుకున్నది పోగా, సుమారు 12 లక్షల టన్నుల ధాన్యం మిగిలిందని, ఆ ధాన్యాన్ని గ్లోబల్ టెండర్ల ద్వారా వేలం వేయాలని నిర్ణయించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

‎బిడ్డర్లు తక్కువ ధరకు కోట్ చేయడంతో ఆ టెండర్లను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసిన మంత్రి

‎దీంతో అసలు బిడ్డర్లు ఎందుకు తక్కువ ధరకు కోట్ చేశారనే అనుమానంతో విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించిన రేవంత్ రెడ్డి

‎సంబంధిత శాఖ మంత్రికి చెప్పకుండానే రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం, కనీసం పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా మంత్రికి ఈ విషయం చెప్పకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

‎"నా శాఖలో ఏం జరుగుతుందో నేను పత్రికల్లో చూసి తెలుసుకోవాలా? ఎవరి ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు?" అంటూ అధికారులపై విరుచుకుపడ్డ మంత్రి

‎"నా శాఖపై రేవంత్ రెడ్డి పెత్తనం ఏంటి? నా ప్రతిష్ఠను దెబ్బతీయడానికే ఈ కుట్రలు చేస్తున్నారా?" అంటూ సన్నిహితుల వద్ద వాపోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్.పదవ తారారతి పరీక్షా కేంద్రంలో సెల్ ఫోన్ నిషేదం
మార్చి 14 నుండీ జరిగే 10వతరగతి పరీక్షలను పకడ్బంధిగా నిర్వహించాలని జిల్లా కలెక్టరు ఇ  ఎల్...
By Sadaq Sadaq 2026-02-24 17:15:59 0 250
BMA
Silenced Behind Bars: The Rise of Journalist Detentions
Around the world, a disturbing number of journalists face systematic detention under restrictive...
By JoinBMA 2026-08-19 09:06:37 0 99
Telangana
మల్లంపేట లో బారీ వర్షం
ప్రస్తుతం మల్లంపేట (హైదరాబాద్) పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్లు మరియు వాతావరణం...
By Ponnala Srinivasrao 2026-06-09 12:53:33 0 167
BMA
Demolishing Fake News: The Power of Verified Truth
In an era dominated by political IT cells and algorithmic misinformation, the absolute strength...
By JoinBMA 2026-08-21 10:25:05 0 265
Andhra Pradesh
అనంతపురం: జిల్లా కేంద్రంలోని నంబూరి వైన్ షాప్ కు నిప్పుప రిమాండ్ ... జిల్లా జైలుకు తరలింపు
జిల్లా కేంద్రంలోని నంబూరి వైన్ షాప్ కు నిప్పుపెట్టిన కేసులో మరో ముగ్గురు నిందితులు అరెస్ట్... 14...
By Eslavath RameshNaik 2026-01-25 15:53:09 0 606
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com