విద్యాశాఖలో లోకేష్ అన్న విప్లవాత్మకమైన మార్పులు – డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

0
216

విద్యాశాఖలో లోకేష్ అన్న విప్లవాత్మకమైన మార్పులు – డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం, అగ్రహారం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు దాతల సహకారంతో 35 సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతూ, విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అన్ని వసతులు కల్పిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు అభినందనలు తెలిపారు. విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ, విద్యార్థులను ఉన్నత విలువలతో తీర్చిదిద్దుతున్నారని అన్నారు.

పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యార్థినులకు అవసరమైన సైకిళ్లను పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని డాక్టర్ లక్ష్మీ తెలిపారు.

విద్యార్థినులకు 35 సైకిళ్లను దాతలు దేవినేని కోటేశ్వరరావు, కంచుమాటి శ్రీనివాసరావు, దిరిశాల శ్రీనివాసరావు, రాజా గార్లు అందించారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కూరపాటి శ్రీను, మాజీ మండల పార్టీ అధ్యక్షులు సోమేపల్లి శ్రీను, మాజీ జడ్పీటీసీ కొక్కెర నాగరాజు, మండల టీడీపీ నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పశ్చిమ వాడవాడల్లో జగనన్న జన్మదిన వేడుకలు
విజయవాడ 21-12-2025   ప్రచురణార్ధం   *పశ్చిమలో వాడ వాడ ల జగనన్న జన్మదిన వేడుకలు*...
By Rajini Kumari 2025-12-21 12:20:53 0 261
Andhra Pradesh
*దూళ్ళ వారి నూతన వస్త్ర బహుకరణ మహోత్సవంలో రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు*
బాపట్ల పట్టణం పాత బస్టాండ్ ఏరియా లో గల పూర్ణ ప్యాలెస్ నందు జరుగుతున్న బాపట్ల అసోసియేషన్ సీనియర్...
By Vadlamudi NagaVenkat 2026-03-05 08:55:51 0 396
Telangana
ఘనంగా ప్రధానమంత్రి జయంతి వేడుకలు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా ఆయన...
By Sidhu Maroju 2025-09-17 15:47:17 0 317
BMA
Protecting Workers: Press Exposing Workplace Hazards
Investigative reporting into hazardous factories, illegal sweatshops, and denied worker benefits...
By JoinBMA 2026-08-21 10:52:28 0 140
Andhra Pradesh
High Court: ‘మదనపల్లె’పై జోక్యం చేసుకోలేం
అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు మార్చడాన్ని నిలువరించలేమని హైకోర్టు తేల్చిచెప్పింది.
By Pagadala Venkateswar 2026-01-08 07:38:58 0 209
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com