కనిగిరికి శాశ్వత త్రాగునీటి పరిష్కారమే లక్ష్యం ప్రజల దాహానికి శాశ్వత విముక్తి కోసం ఎమ్మెల్యే కృషి

0
200

కనిగిరికి శాశ్వత త్రాగునీటి పరిష్కారమే లక్ష్యం ప్రజల దాహానికి శాశ్వత విముక్తి కోసం ఎమ్మెల్యే కృషి

కనిగిరి నియోజకవర్గ ప్రజలను ఎన్నో సంవత్సరాలుగా వేధిస్తున్న త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలనే సంకల్పంతో, రాబోయే కాలంలో నీటి కొరత మరింత తీవ్రమయ్యే పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన గౌరవ కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టీడీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు, ఈరోజు గౌరవ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారిని కలిసి ప్రత్యేక వినతిపత్రం సమర్పించారు.

ఒక్క బిందె మంచి నీటి కోసం కిలోమీటర్ల దూరం నడిచే తల్లులు తాగునీటి కోసం గంటల తరబడి ఎదురు చూసే కుటుంబాలు ఫ్లోరైడ్ కలిసిన నీటిని తాగి ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న చిన్నారులు, వృద్ధులు. ఈ బాధలకు శాశ్వత ముగింపు పలకాలనే లక్ష్యంతో కనిగిరికి సమగ్ర తాగునీటి ప్రాజెక్టును మంజూరు చేయాలని మంత్రి గారిని ఎమ్మెల్యే గారు కోరారు.

తాగునీరు అనేది విలాసం కాదు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. కనిగిరి ప్రజలు ఇకపై నీటి కోసం ఇబ్బందులు పడకుండా, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు చేరేలా శాశ్వత పరిష్కారం తీసుకురావడమే నా ధ్యేయం అని గౌరవ ఎమ్మెల్యే శ్రీ డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు పేర్కొన్నారు.

ప్రజల దాహం తీరే వరకు కనిగిరికి శాశ్వత త్రాగునీటి పరిష్కారం వచ్చే వరకు తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని* ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు.

Search
Categories
Read More
SURAKSHA
Syed Ali Murtaza Rizvi IAS: A Vision for Good Governance
A distinguished Telangana IAS officer whose administrative excellence, visionary leadership, and...
By Lokeshwari Panthadi 2026-07-10 10:23:00 0 181
BMA
Defying Draconian Laws: The Courage of the Reporter
The psychological and moral strength of the press is most visible when journalists endure extreme...
By JoinBMA 2026-08-21 10:34:07 0 135
Andhra Pradesh
మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో తాగునీటి సమస్య – అధికారులు స్పందన.
మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో తాగునీటి సమస్య తీవ్రతరం కావడంతో అధికారులు శనివారం స్పందించారు. పాత...
By Pagadala Venkateswar 2026-04-05 06:13:17 0 202
Andhra Pradesh
గుంటూరు జిల్లా పోలీసుల విజ్ఞప్తి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా – సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి..
సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ మొదలైన నేరాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గుంటూరు జిల్లా...
By John Baji 2026-01-23 01:55:34 0 268
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com