Madanapalle: మదనపల్లె తాగునీటి బోరు తవ్వకాలను వేంపల్లి ప్రజలు అడ్డుకున్నారు. భూగర్భ జలాలు పడిపోతాయని ఆందోళన చేపట్టడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

0
107

మున్సిపాలిటీ కోసం బోరు తవ్వకాలు.. అడ్డుకున్న వేంపల్లి గ్రామస్థులు

 

మదనపల్లె, జూలై 23: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో నెలకొన్న తాగునీటి కొరతను దృష్టిలో ఉంచుకుని అర్బన్ మున్సిపాలిటీకి నీటి సరఫరా కోసం వేంపల్లి పంచాయతీ పరిధిలో బోరు తవ్వేందుకు అధికారులు బుధవారం అక్కడికి చేరుకున్నారు.

 

అయితే గ్రామంలో భూగర్భ జలాలు తగ్గిపోతాయని, తమ గ్రామానికి భవిష్యత్తులో నీటి సమస్య మరింత తీవ్రమవుతుందనే ఆందోళనతో గ్రామస్థులు అధికారులను అడ్డుకున్నారు.

 

ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ, ఇప్పటికే వేంపల్లి పంచాయతీలో తీవ్ర తాగునీటి సమస్య నెలకొని ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో మున్సిపాలిటీ అవసరాల కోసం బోరు తవ్వితే గ్రామంలోని భూగర్భ జలాలు మరింత తగ్గిపోయి తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులకు వివరించారు.

 

గ్రామ ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా బోరు తవ్వకాలు చేపట్టవద్దని వారు డిమాండ్ చేశారు.

 

దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, అధికారులు గ్రామస్థులతో చర్చలు జరిపి పరిస్థితిని సమీక్షించారు.

 

తదుపరి నిర్ణయం తీసుకునే వరకు బోరు తవ్వకాలపై స్పష్టత రాలేదు

Search
Categories
Read More
Andhra Pradesh
నిజమైన అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తోనే సాధ్యం - ఎమ్మెల్యే కొండయ్య
చీరాల నియోజవర్గం చీరాల పట్టణం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో చీరాల పట్టణ అధ్యక్షుడు సురేష్...
By Vadlamudi NagaVenkat 2026-04-20 05:32:15 0 281
Sikkim
Final Railway Survey Approved for Melli–Dentam Line in Sikkim
The Ministry of Railways has approved the final location survey for a proposed Melli-to-Dentam...
By Bharat Aawaz 2025-07-17 07:29:54 0 1K
Andhra Pradesh
నందవరం మండల కేంద్రంలోని కూటమి నాయకులు CBN జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ. నారా చంద్రబాబు నాయుడు గారి 76 వ జన్మదిన వేడుకలను...
By Boya Dasthagiri 2026-04-20 15:40:30 0 193
SURAKSHA
H. Rajesh Prasad IAS: Driving Chandigarh's Growth
A distinguished IAS officer whose transparent governance, administrative excellence, and...
By Lokeshwari Panthadi 2026-07-28 12:39:02 0 161
Andhra Pradesh
ముండ్లమూరు మండలం, ఈదర గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త భూమా గోవిందరెడ్డి గారి ఆహ్వానం మేరకు వారి నివాసానికి వెళ్లడం జరిగింది
ముండ్లమూరు మండలం, ఈదర గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త భూమా గోవిందరెడ్డి గారి ఆహ్వానం మేరకు...
By Chennaiah Kati 2026-07-03 09:57:11 0 91
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com