Bharat Aawaz

వర్షానికి ఇల్లు కూలిన బాధితురాలికి కొండంత భరోసా. ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా కృషి చేస్తాం మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకాష్, వైస్ చైర్‌పర్సన్ ఎండి అహ్మద్

Chunarkar Jagadeesh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
307
Views

🎤భారత్ ఆవాజ్ న్యూస్, ఆసిఫాబాద్ పట్టణంలోని మేకలవాడలో వర్షాల ధాటికి జూలాల లక్ష్మి అనే నిరుపేద మహిళ ఇంటి గోడలు కూలిపోయాయి. స్థానిక కౌన్సిలర్ జేబ షేక్ సమాచారంతో మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకాష్, వైస్ చైర్‌పర్సన్ ఎండి అహ్మద్, తహసిల్దార్  రియాజ్ అలీ, మున్సిపల్ కమిషనర్ అంజయ్య గురువారం క్షేత్రస్థాయిలో బాధితురాలి ఇల్లు పరిశీలించి ధైర్యం చెప్పారు.బాధితురాలి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఆమెకు 'ఇందిరమ్మ ఇల్లు' మంజూరయ్యే విధంగా శాయశక్తులా కృషి చేస్తామని మరియు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందేలా చూస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చిలువూరు వెంకటేశ్వర్లు, సాలం బీన్ అహ్మద్, బీఆర్ఎస్ నాయకులు సమద్, అధికారులు పాల్గొన్నారు.