ప్రజల సమస్యల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

0
247

ప్రజల సమస్యల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమంకు 60 ఫిర్యాదులు

ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్థన్‌ రాజు ఐపియస్.,గారి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా ఓఎస్డీ (అడ్మిన్) నవజ్యోతి మిశ్రా, ఐపీఎస్., గారు మరియు పోలీసు అధికారులతో కలిసి సోమవారం మార్కాపురం జిల్లా పోలీసు కార్యాలయంలో మీకోసం (PGRS) కార్యక్రమం నిర్వహించారు.

ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమగ్రంగా విచారణ జరిపి, ఫిర్యాదుదారులు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని ఓఎస్డీ (అడ్మిన్) గారు ఆదేశించారు. వివిధ సమస్యలతో పోలీసు కార్యాలయాలకు వచ్చే బాధితులకు పోలీసు శాఖ భరోసాగా నిలవాలని, ప్రతి ఫిర్యాదును నమోదు చేసి, నిర్ణీత గడువులో పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఫిర్యాదుల కోసం వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, నడవలేని స్థితిలో ఉన్నవారికి ప్రత్యేక శ్రద్ధతో స్పందించి, వారి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను సమీపంలోని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాల్లో కూడా అందజేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా సివిల్ భూ ఆర్థిక తగాదాలు చీటింగ్జాబ్ ఫ్రాడ్, అత్తరింటి వేదింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. 

ఈ కార్యక్రమంలో మార్కాపురం డిఎస్పీ యు.నాగరాజు, మార్కాపురం సీఐ అల్తాఫ్ హుస్సేన్, త్రిపురాంతకం సిఐ అస్సన్, టీవీ పల్లి ఎస్ఐ శివ బసవరాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా: కూన శ్రీశైలం గౌడ్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా/ కుత్బుల్లాపూర్.   కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్, మాజీ...
By Sidhu Maroju 2025-08-05 08:41:36 0 843
Andhra Pradesh
చీరాల క్లాక్ టవర్ సెంటర్ లో శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల...
చీరాల: ఇతర పార్టీలు బీసీలను కరివేపాకుల మాదిరి తీసేస్తే వారిని తులసి దళాలుగా మార్చిన ఘనత టిడిపి...
By Gadiyapudi Narendra 2026-01-23 16:11:35 0 257
SURAKSHA
112: Your Unified Emergency Response
The 112 emergency helpline serves as a vital, integrated lifeline for citizens, ensuring rapid...
By Kalaga Sailaja 2026-06-26 11:54:21 0 163
Andhra Pradesh
Pawan Kalyan: పార్టీ నేతలకు కీలక సూచన చేసిన పవన్ కల్యాణ్.
Pawan Kalyan Issues Key Directives to Party Leaders ఇతర వ్యక్తుల మధ్య జరిగే వాటిని జనసేనకు...
By Pagadala Venkateswar 2026-01-22 10:39:50 0 191
Andhra Pradesh
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన గూడూరి ఎరీక్షణ బాబు గారు....
ఎన్టిఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన గూడూరి ఎరిక్షన్ బాబు గారు... మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం...
By Chennaiah Kati 2026-01-31 14:32:52 0 282
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com