విద్యార్థుల డిజిటల్ విద్యకు స్మార్ట్ టీవీ బహూకరణ

0
372

మహబూబాబాద్,
మహబూబాబాద్ మండలంలోని ఎంపీపీఎస్ హనుమంతునిగూడెం పాఠశాల విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం కీర్తిశేషులు బండి ఎలేంద్ర, బిక్షపతి కుమారుడు బండి శ్రీనివాస్ తన తల్లిదండ్రుల స్మారకార్థం రూ.25 వేల విలువైన స్మార్ట్ టీవీని పాఠశాలకు బహూకరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలాజీ కుమార్ మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బోధన అత్యంత అవసరమని అన్నారు. పేద, వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు నాణ్యమైన డిజిటల్ విద్యను అందుకునేందుకు ఈ స్మార్ట్ టీవీ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

విద్య పట్ల సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి పాఠశాలకు స్మార్ట్ టీవీని అందించిన శ్రీ బండి శ్రీనివాస్ సేవాభావం, దాతృత్వాన్ని ఆయన కొనియాడారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కిరణ్ కుమార్, శంకర్, సాయికుమార్, శిరీష పాల్గొని దాతకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం సమాజంలోని దాతలు ఇలాంటి సేవా కార్యక్రమాలకు మరింతగా ముందుకు రావాలని ఆకాంక్షించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
డిజిటల్ మహానాడును జయప్రదం చేయండి: ఎమ్మెల్యే.
మదనపల్లె నియోజకవర్గంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న డిజిటల్ మహానాడును విజయవంతం చేయాలని...
By Pagadala Venkateswar 2026-05-27 06:05:03 0 114
Andhra Pradesh
రైతుల ప్రయోజనాలే నూతన పాలకవర్గం పరమావధి కావాలి : ప్రత్తిపాటి
రైతుల ప్రయోజనాలే నూతన పాలకవర్గం పరమావధి కావాలి గుంటూరు మిర్చి యార్డ్ నూతన ఛైర్మన్ కు మాజీమంత్రి...
By Gadiyapudi Narendra 2025-12-27 16:11:37 0 510
Andhra Pradesh
‘డ్రగ్స్కు యువత దూరంగా ఉండాలి’
డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలని పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. బొబ్బిలి మండలం కొత్తవలసలో అభ్యుదయం...
By Boiena Rajesh 2026-08-11 03:58:09 0 119
Andhra Pradesh
పుంగనూరు: సర్వాంగ సుందరంగా ముస్తాబైన పెద్ద దర్గా
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని ఎన్. ఎస్. పేటలో ఉన్న హజ్రత్ సయ్యద్ నూర్ షావలి బాబా దర్గాలో...
By Kothuru Murali 2026-05-08 14:19:29 0 166
SURAKSHA
Krishna Teja Mylavarapu, IAS: Leading with Vision and Purpose
The Journey begins "True leadership is not measured by authority but by the positive impact it...
By Fathima Safa 2026-07-15 07:47:23 0 132
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com