Madanapalle: మదనపల్లె వివేకానంద మున్సిపల్ హైస్కూల్‌లో హిందీ ఉపాధ్యాయుల కొరత తీరింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా తక్షణమే స్పందించి DEO, MEO లతో మాట్లాడి టీచర్.

0
114

వివేకానంద మున్సిపల్ హైస్కూల్‌లో హిందీ ఉపాధ్యాయుల నియామకం.. ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవకు తల్లిదండ్రుల ధన్యవాదాలు

 

మదనపల్లె: పట్టణంలోని 34, 35 వార్డుల పరిధిలోని రామిరెడ్డి లేఔట్‌లో ఉన్న వివేకానంద మున్సిపల్ హైస్కూల్‌ను 35వ వార్డు ఇన్‌చార్జి రమేష్ రెడ్డి, 34వ వార్డు ఇన్‌చార్జి బాలమల్లి శేఖర్ సందర్శించారు.

 

ఈ సందర్భంగా పాఠశాల హెడ్‌మాస్టర్‌తో మాట్లాడి విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు అందుతున్నాయా లేదా అనే అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

 

ఇదే సమయంలో పాఠశాలలో హిందీ ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వార్డు ఇన్‌చార్జిలు వెంటనే స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు సమాచారం అందించారు.

 

ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పందించి ఫోన్ ద్వారా డీఈఓ, ఎంఈఓలతో మాట్లాడి వెంటనే హిందీ ఉపాధ్యాయులను నియమించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుల నియామకం జరగడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు కృతజ్ఞతలు తెలిపారు.

Search
Categories
Read More
BMA
Disaster Relief: Crowdsourcing Flood Fund Receipts
Following massive natural disasters, the distribution of state relief funds is often plagued by...
By JoinBMA 2026-09-08 04:56:27 0 107
Gujarat
GIFT City Goes Global: Taiwan’s CTBC Bank Opens Branch
In a historic first for Indo-Taiwanese financial relations, CTBC Bank Co. Ltd. has inaugurated...
By Dunna Jessicaruth 2026-05-15 05:03:20 0 118
Andhra Pradesh
టీటీడీలో కొలువులు... ఇంజనీరింగ్ పోస్టుల పరీక్షల షెడ్యూల్ విడుదల.
టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన మే 10, 11 తేదీలలో ఆన్‌లైన్ పద్ధతిలో...
By Pagadala Venkateswar 2026-04-25 05:02:15 0 128
SURAKSHA
Vaibhav Galriya IAS: Transforming Rajasthan Finance
A 1998-batch Rajasthan cadre IAS officer, Vaibhav Galriya has earned a reputation as one of the...
By Lokeshwari Panthadi 2026-08-01 05:45:20 0 118
Telangana
పెద్దపల్లిలో ఈనెల 19న జాబ్ మేళా....!
పెద్దపెల్లి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఫైనాన్స్ కంపెనీలో ఉపాధి కల్పించుటకు ఈనెల 19న పెద్దపల్లిలో...
By Sunka Santhosh 2026-06-16 19:27:35 0 120
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com