Madanapalle: రామసముద్రంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు. రూ. 11,200 నగదు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం. చట్టవిరుద్ధ పనులపై ఎస్సై హెచ్చరిక.

0
114

మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రం మండల కేంద్రం శీతరగానిపల్లె సమీపంలో చెట్టు కింద పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం ఎస్సై హృషికేశవ రెడ్డి సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి నిర్వహించారు.

 

ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుంచి రూ.11,200 నగదుతో పాటు 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హృషికేశవ రెడ్డి తెలిపారు.

 

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, చట్టవిరుద్ధమైన పేకాట, జూదం వంటి కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా పేకాట లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

Search
Categories
Read More
Bharat
దేశవ్యాప్తంగా డిజిటల్ విద్య విస్తరణతో విద్యా రంగానికి కొత్త ఊపు
దేశంలోని పాఠశాలలు మరియు ఉన్నత విద్యా సంస్థల్లో డిజిటల్ విద్యను మరింత విస్తరించేందుకు కేంద్ర...
By Shiva Reddy Kanuganti 2026-08-07 05:41:26 0 221
Gujarat
Tragedy in Bharuch: Mall Wall Collapse Claims Two Lives
A devastating incident occurred in Bharuch today as a shopping mall’s compound wall...
By Lokeshwari Panthadi 2026-07-01 06:18:17 0 96
Andhra Pradesh
ఆటోని కారు ఢీకొన్న ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి
ఆటోని కారు ఢీకొన్న సంఘటనలో మహిళతో సహా ఇరువురి మృతి.. నందిగామ ఎన్టీఆర్ జిల్లా  ఆటోని కారు...
By Patan Khuddus 2026-04-25 11:11:48 0 300
SURAKSHA
Abhishek Trivedi: Transforming Corrections Through Leadership
A distinguished 2004-batch IPS officer of the Himachal Pradesh Cadre, leading Prisons &...
By Lokeshwari Panthadi 2026-07-24 10:17:16 0 485
Andhra Pradesh
ఢిల్లీ, అస్సాం పర్యటనకు సీఎం చంద్రబాబు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ, అస్సాం వెళ్లనున్న సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీలో కేంద్ర...
By Pagadala Venkateswar 2026-05-11 06:30:12 0 135
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com