భాజపా శ్రేణులకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం.|

0
222

- ఎస్‌ఐఆర్ ప్రక్రియను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని పిలుపు.

- అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు.

- దొంగ ఓట్లపై అప్రమత్తంగా ఉండాలని సూచన.

హైదరాబాద్, జూలై 18: సికింద్రాబాద్‌లో నిర్వహించిన భాజపా కార్యవర్గ సమావేశానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు సంస్థాగత కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో పార్టీ నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. 

భారత పౌరసత్వం కలిగిన ప్రతి అర్హుడైన ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని తెలిపారు. 

ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసి వారి వివరాలను నమోదు చేయించి ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పాతబస్తీతో పాటు ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో మజ్లిస్ పార్టీ దొంగ ఓట్లను చేర్చేందుకు ప్రయత్నిస్తోందని, దీనికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. 

ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా చట్టబద్ధంగా, పారదర్శకంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ జరిగేలా చూడాల్సిన బాధ్యత భాజపా శ్రేణులపై ఉందని ఆయన స్పష్టం చేశారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Telangana
మతం మారితే.. ఎస్సీ హోదా రద్దు.|
● ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు ● క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ హోదా...
By Sidhu Maroju 2026-07-27 06:50:58 0 165
Telangana
గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తా
మీ అమూల్యమైన ఓటును బ్యాట్ గుర్తుకు వేసి గెలిపించండి    కొత్తగూడ డిసెంబర్ 15, (భారత్...
By Bheeshman King 2025-12-16 07:29:03 0 371
Telangana
తెలంగాణ ఆవిర్భ దినోత్సవం కోసం బిఆర్ఎస్ నాయకులు....
నర్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు..బిఆర్ఎస్ అధినేత & మాజీ...
By Gujile Ramu 2026-04-26 14:29:21 0 392
Assam
Brahmaputra Floods Submerge Thousands of Hectares
Major rivers in the region, most notably the expansive Brahmaputra, have breached their banks,...
By Lokeshwari Panthadi 2026-07-01 09:48:52 0 99
Telangana
పెద్దపల్లి : పిల్లలు ప్రభుత్వ స్కూల్లోనే చేర్పిస్తాం.. గ్రామస్తుల నిర్ణయం...!
పెద్దపల్లి : ప్రైవేట్ స్కూళ్లలో లక్షల ఫీజులు కడుతూ పోటీ పడుతున్న ఈ రోజుల్లో, పెద్దపల్లి జిల్లాలో...
By Sunka Santhosh 2026-06-10 18:11:21 0 123
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com