టీపీసీసీ కీలక నిర్ణయం...పాలభిషేకాలు, జేసీబీలపై నిషేధం.|

0
110

హైదరాబాద్, జూలై 16 : కాంగ్రెస్ పార్టీ అధికారిక వేడుకలు, కార్యక్రమాల్లో ఆడంబరాలకు, ఆహార వృథాకు అడ్డుకట్ట వేస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ నిర్వహించే ఎలాంటి కార్యక్రమాల్లోనైనా సరే పాలభిషేకాలు, జలాభిషేకాలు చేయడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. 

ఈ మేరకు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ టి. కుమార్ రావు ఒక అధికారిక సర్క్యులర్ లేఖను విడుదల చేశారు.తెలంగాణ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వెల్లడించింది. 

దేశంలో ఎంతో మంది పోషకాహార లోపంతో బాధపడుతుంటే, వేడుకల పేరిట పాలను, ఇతర ఆహార పదార్థాలను వృథా చేయడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు, ఆదర్శాలకు పూర్తి విరుద్ధమని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఇటువంటి వృథా పనులకు స్వస్తి చెప్పి, పేదలకు ఆహార పంపిణీ కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఇదే సమయంలో సీనియర్ నాయకుల పర్యటనల్లో జేసీబీలు, బుల్డోజర్లు, భారీ క్రేన్లను ఉపయోగించి భారీ పూలదండలు వేసే సంస్కృతిపై టీపీసీసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బుల్డోజర్లు, జేసీబీ వంటి వాహనాలు అణచివేతకు ప్రతీకలని, ప్రజా పక్షాన నిలిచే కాంగ్రెస్ సంస్కృతికి ఇవి ఏమాత్రం తగవని స్పష్టం చేసింది.ఇకపై పార్టీ నాయకుల సన్మానాల కోసం ఇలాంటి భారీ యంత్రాలను ఉపయోగిస్తే కఠిన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించింది. 

ఈ కొత్త నిబంధనలను రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు అందరూ కచ్చితంగా పాటించాలని టీపీసీసీ స్పష్టం చేసింది.

#Sidhumaroju

Search
Categories
Read More
Telangana
ప్రభుత్వ భూములను సంరక్షించాలి, ఆర్డీవో కు వినతి
చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో, శ్రీ లక్ష్మీనరసింహస్వామి, గుట్ట వద్ద ఉన్న ప్రభుత్వ భూములు ,...
By Nookapangu Manikanta 2026-05-14 12:59:40 0 336
Maharashtra
BMC Takes Strict Action Against Officials Avoiding Transfer
The Brihanmumbai Municipal Corporation (BMC) has initiated rigorous administrative action...
By Lokeshwari Panthadi 2026-07-01 07:40:33 0 177
SURAKSHA
Manoj Verma, IPS: Championing Law and Order with Excellence
The Journey Begins "Strong policing begins with public trust, decisive...
By Fathima Safa 2026-07-28 07:32:24 0 117
Telangana
రేపు బీసీ బంద్ : తెలంగాణ డిజిపి కీలక సూచనలు
హైదరాబాద్ : బీసీ సంఘాలు రేపు తలపెట్టిన బీసీ బంద్ ను శాంతియుతంగా నిర్వహించుకోవాలని తెలంగాణ రాష్ట్ర...
By Sidhu Maroju 2025-10-17 14:08:29 0 333
Telangana
సంక్రాంతి శోభ - ముగ్గుల ప్రభ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  ప్రజా పాలనలో మహిళలకు పెద్దపీట వేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...
By Sidhu Maroju 2026-01-12 10:07:54 0 271
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com