హనీ ట్రాప్‌తో కిడ్నాప్.. నకిలీ పోలీసుల ముఠా గుట్టురట్టు.|

0
169

"వ్యాపారవేత్తను అపహరించి రూ.18 లక్షలు, బంగారం దోచుకున్న ముఠాపై అల్వాల్ పోలీసుల అంతర్రాష్ట్ర ఆపరేషన్.. ఐదుగురు నిందితుల అరెస్ట్"

మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 16: హనీ ట్రాప్, నకిలీ పోలీసుల వేషధారణ, కిడ్నాప్, దోపిడీ, బెదిరింపుల వంటి సంచలనాత్మక కేసును అల్వాల్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. 

ఈ కేసులో పరారీలో ఉన్న ఐదుగురు నిందితులను హర్యానా, చండీగఢ్ రాష్ట్రాల్లో నిర్వహించిన ప్రత్యేక అంతర్రాష్ట్ర ఆపరేషన్‌లో అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వ్యాపారవేత్త గర్లపాటి వెంకట దుర్గ నాగేశ్వర సిద్ధార్థను 2025 నవంబర్ 14న మచబొల్లారం ఐస్ ఫ్యాక్టరీ రోడ్డు సమీపంలో నిందితులు పోలీసులమంటూ అడ్డగించారు. 

అనంతరం స్కార్పియో వాహనంలో బలవంతంగా ఎక్కించి, తుపాకీతో బెదిరించి దాడి చేశారు. బాధితుడి వద్ద ఉన్న సుమారు 10 తులాల బంగారు ఆభరణాలు, డెల్ ల్యాప్‌టాప్, వన్‌ప్లస్ మొబైల్ ఫోన్‌ను దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అంతేకాకుండా బాధితుడి కుటుంబ సభ్యులను బెదిరించి రూ.18 లక్షలు వసూలు చేసిన అనంతరం, ఆంధ్రప్రదేశ్–ఒడిశా సరిహద్దులోని బెర్హంపూర్ అటవీ ప్రాంతంలో బాధితుడిని విడిచిపెట్టి వెళ్లిపోయినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఈ కేసులో వీసా ప్రాసెసింగ్ పేరుతో బాధితుడిని ప్రలోభపెట్టి, అతని వ్యక్తిగత వివరాలు, కదలికలను ప్రధాన నిందితులకు అందించిన ఇద్దరు నిందితులను ఇప్పటికే జూన్ 23న అరెస్టు చేసి న్యాయస్థాన రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు నాగరాజు రఘు వర్మ మరో కేసులో ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్లు వెల్లడించారు.

కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా అల్వాల్ డీఐ కె. వీరబాబు, ఎస్‌ఐ చంద్రశేఖర్ నేతృత్వంలోని బృందం హర్యానా, చండీగఢ్‌లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి, పరారీలో ఉన్న సునీల్ ఫౌజీ, రింకు రికీ సంధు, రాజేష్ అలియాస్ సర్పంచ్ జైవీర్ సింగ్‌తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకుంది.

నిందితుల వద్ద నుంచి 3.5 తులాల బంగారు ఆభరణాలు, రూ.3.8 లక్షల నగదు, నేరానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన దొంగిలించిన ఆస్తి స్వాధీనం, పరారీలో ఉన్న ఇతర నిందితుల అరెస్టుకు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

ఈ కేసు దర్యాప్తును మల్కాజిగిరి డీసీపీ సి.హెచ్. శ్రీధర్, అదనపు డీసీపీ కె. రామ్ కుమార్, బేగంపేట్ ఏసీపీ పి. గోపాలకృష్ణమూర్తి పర్యవేక్షించారు. కేసును ఛేదించిన డీఐ కె. వీరబాబు, ఎస్‌ఐ చంద్రశేఖర్‌తో పాటు దర్యాప్తు బృందాన్ని డీసీపీ సి.హెచ్. శ్రీధర్ అభినందించారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
ప్రేమ వ్యవహారం మలుపు తిరిగి హత్య.. మారేడుపల్లి పోలీసుల మెరుపు దర్యాప్తు.|
సికింద్రాబాద్ : మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన శ్రవణ్ హత్య కేసును పోలీసులు...
By Sidhu Maroju 2026-06-03 07:08:09 0 208
Andhra Pradesh
అన్న క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్
*మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్*  ...
By Rajini Kumari 2026-03-09 13:02:48 0 219
Andhra Pradesh
లక్ష దీపాలార్చనకు విశేష స్పందన
బొబ్బిలి మండలం నారాయణప్పవలస, కాశిందొరవలసలో మంగళవారం బ్రహ్మ కుమారీలు నిర్వహించిన లక్ష దీపాలార్చనకు...
By Boiena Rajesh 2026-04-01 00:28:13 0 266
BMA
JWS Enhances Financial Power of Indian Journalists
The economic security of field reporters has been reinforced through the revised Journalist...
By JoinBMA 2026-08-20 05:49:10 0 84
Andhra Pradesh
కార్ మెకానిక్ షెడ్‌లో దొంగల బీభత్సం – నగదు, కారు అపహరణ..
చీరాల: చీరాలలో జాతీయ రహదారి–216పై ఉన్న శ్రీ వినాయక కార్ మెకానిక్ షెడ్‌లో అర్ధరాత్రి...
By Gadiyapudi Narendra 2026-02-18 05:32:45 0 233
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com