ముద్రగడకు అధికారిక లాంఛనాలు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయం.

0
100

మాజీ మంత్రి, ప్రముఖ రాజకీయ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయం ఇరువురు నేతలు ఫోన్ ద్వారా చర్చించి, ఈ అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చారు.

 

ముద్రగడ పద్మనాభం రాష్ట్రానికి అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఆయనకు ఈ గౌరవాన్ని ప్రకటించాలని ప్రభుత్వం నిశ్చయించింది. నాలుగుసార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా, రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యుడిగా ఆయన అందించిన సుదీర్ఘ సేవలను ఈ సందర్భంగా నేతలు స్మరించుకున్నారు. ప్రజా జీవితంలో ఆయన సేవలకు గౌరవ సూచకంగా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు.

 

ప్రభుత్వ నిర్ణయం మేరకు తక్షణమే అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముద్రగడ మంగళవారం సాయంత్రం కన్నుమూసిన విషయం విదితమే. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన స్వగ్రామంలో బుధవారం ముద్రగడ అంత్యక్రియలు

Search
Categories
Read More
Andhra Pradesh
ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి అండగా వైయస్ జగన్
ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి అండగా వైయస్ జగన్   - తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర...
By Rajini Kumari 2026-06-15 01:50:22 0 364
SURAKSHA
P. K. Madhu, IPS: A Lifetime of Courage and Leadership
The Journey begins "The true strength of policing lies in protecting the...
By Fathima Safa 2026-07-16 12:08:01 0 130
BMA
Shrinking Editions: The 'Sweet Spot' Survival Strategy
Facing massive revenue deficits, Indian newspapers are adopting a desperate "Sweet Spot"...
By JoinBMA 2026-08-20 08:01:26 0 75
Andhra Pradesh
ప్రైవేట్ బస్సు సౌకర్యంపై ప్రయాణికుల ఆగ్రహం!
వెబ్‌సైట్‌లో అన్నీ బాగున్నాయని చూపిస్తున్నారు… కానీ నిజం వేరే ఉంది వింజమూర్....
By VALLERU SIMHADRI 2026-09-04 13:31:38 0 250
Media Academy
Why Journalism Is The Most Important Career Today: Shaping The Future Of Society
Why Journalism Is The Most Important Career Today: Shaping The Future Of Society In...
By Media Academy 2025-04-28 18:13:59 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com