ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి అండగా వైయస్ జగన్

0
358

ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి అండగా వైయస్ జగన్

 

- తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం

- కూటమి ప్రభుత్వంలో వ్యాపారులు, ఆర్యవైశ్యులపై వేధింపులు పెరిగాయి 

- ఆర్య‌వైశ్యులంతా ఒక‌తాటిపైకి రావాలి

- టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్ట‌డంలో ఆర్య‌వైశ్యులు భాగ‌స్వాములు కావాలి

- సజ్జల రామ‌కృష్ణారెడ్డి పిలుపు

 

- ఆర్యవైశ్యులకు వైయస్సార్‌సీపీ జెండా అండ‌ : సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ స్టేట్ కో-ఆర్డినేట‌ర్‌

చంద్ర‌బాబు కూటమి ప్రభుత్వం ఏర్ప‌డిన‌ప్పటి నుంచి అన్ని వర్గాలపై వేధింపులే లక్ష్యంగా పనిచేస్తోంది. వైయస్‌ జగన్‌ హయాంలో మాత్రం కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా అందరికీ సమాన న్యాయం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో వారి సమస్యలను నమోదు చేసేందుకు ప్రత్యేకంగా డిజిటల్‌ బుక్‌ను ఏర్పాటు చేశాం. ప్రత్యర్థులపై మొదలైన వేధింపులు ఇప్పుడు సామాన్య ప్రజల వరకు చేరాయి. అయినప్పటికీ వైయస్సార్‌సీపీ శ్రేణులకు ధైర్యం, భరోసా, అండగా వైయస్‌ జగన్‌ నిలుస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు శాశ్వతం కావు. ప్రజలకు మళ్లీ మంచి రోజులు వస్తాయి.

 

ఆర్యవైశ్యులు శాంతియుత వాతావరణాన్ని కోరుకునే వర్గం. తమ కష్టంతో ఎదిగే వారికి ప్రభుత్వం భద్రత, ప్రశాంతత కల్పించాలి. కానీ గత రెండేళ్లుగా రాష్ట్రంలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. అవినీతి, దోపిడీ పెరిగిపోగా, ప్రశ్నించే గొంతులను అణచివేసే ప్రయత్నం జరుగుతోంది. వైయస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన మేలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో ఆర్యవైశ్యులు ముందుండాలి. వారి సమస్యల పరిష్కారానికి వైయస్సార్‌సీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కృషి చేస్తుంది.

 

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ఆర్యవైశ్యులను పెద్ద ఎత్తున భాగస్వాములను చేస్తున్నాం. ఇప్పటికే వేలాది మంది ఆర్యవైశ్యులు వివిధ కమిటీల్లో బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, మహిళలు కూడా చురుకుగా పాల్గొంటున్నారు. వారందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించేందుకు వైయస్‌ జగన్‌ కృషి చేస్తున్నారు. ఆర్యవైశ్యులు తమ బలాన్ని సంఘటితం చేసుకుని సమాజంలో, రాజకీయాల్లో మరింత ప్రభావవంతమైన పాత్ర పోషించాలి అని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
BMA
Valley Press Strangled: Economic Pressure and State Control
In June 2026, Kashmiri media organizations are facing severe economic pressures, threatening...
By JoinBMA 2026-08-19 06:40:33 0 77
Andhra Pradesh
కృష్ణ ఫౌండేషన్ ద్వారా నిర్మించిన గ్రామం ముఖద్వారం ప్రారంభోత్సవం పామర్రు ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర
18/1/2026. పెరిసెపల్లి గ్రామం, పామర్రు మండలం.    *సమాజంలో అట్టడుగున ఉన్న పేదల...
By Rajini Kumari 2026-01-18 14:31:34 0 224
Telangana
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధుల వైకల్యం గుర్తింపు శరవేగంగా పూర్తి చేయాలి
నేలకొండపల్లి: విద్యార్థులలో ఉన్న వైకల్యాల గుర్తింపు ప్రక్రియ ను శర వేగంగా పూర్తి చేయాలని...
By Krishna Balina 2026-02-06 10:11:32 0 239
SURAKSHA
Vani Mohan, IAS: Leading Excellence in Governance
A Distinguished Civil Servant Advancing Administrative Excellence, Inclusive Development, and...
By Lokeshwari Panthadi 2026-07-13 08:47:40 0 137
Telangana
వరంగల్ జిల్లాలోని వర్షాలు.....
వరంగల్ జిల్లాలో దంచికొడుతున్న వర్షం....! భారత్ అవాజ్ న్యూస్ వరంగల్ జిల్లా నేడు 7 మే.... ఉమ్మడి...
By Gujile Ramu 2026-05-08 02:50:05 0 164
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com