శాంతిభద్రతల పరిరక్షణకు ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్ యజమానులతో సమావేశం నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

0
120

శాంతిభద్రతల పరిరక్షణకు ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్ యజమానులతో సమావేశం నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, జిల్లా పోలీసులు ఫ్లెక్స్ ప్రింటింగ్ షాపుల యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రజల్లో ఉద్రిక్తతలు, సామాజిక విభేదాలు లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా ఉండే వివాదాస్పద చిత్రాలు, అభ్యంతరకరమైన వాక్యాలు, రెచ్చగొట్టే పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్స్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ముద్రించరాదని సూచించారు.

ముద్రణకు ముందు అందిన డిజైన్‌లు, సందేశాలు, చిత్రాలను తప్పనిసరిగా పరిశీలించి, చట్టాలకు అనుగుణంగా ఉన్న వాటినే ముద్రించాలని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించి ప్రజలను రెచ్చగొట్టే లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించే ఫ్లెక్స్‌లు, బ్యానర్లు ముద్రించినా లేదా సరఫరా చేసినా, సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజలందరూ సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తూ శాంతియుత వాతావరణాన్ని కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
జనసేన సిద్ధాంతాలను నడిచినవారితో సంస్థాగత నిర్మాణం
జనసేన సిద్ధాంతాలను విశ్వసించే నడిచినవారితో సంస్థాగత నిర్మాణం  జనసేన అనేది నిరంతర ప్రవాహంలా...
By Chennaiah Kati 2026-06-28 06:31:15 0 95
Andhra Pradesh
గ్రామీణ ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం చట్టాలను సరళీకృతం చేసిందని జిల్లా కలెక్టర్ డా||వి.వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్ గారు తెలిపారు.
గ్రామీణ ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం చట్టాలను సరళీకృతం చేసిందని జిల్లా కలెక్టర్ డా||వి.వినోద్...
By Gadiyapudi Narendra 2026-01-06 12:27:27 0 343
Andhra Pradesh
రెవిన్యూ అధికారుల అవినీతి – కలెక్టరేట్ వద్ద బాధితుల ధర్నా.
జరాపల్లి గ్రామంలోని భూమి విషయంలో రెవిన్యూ అధికారుల అవినీతి కారణంగా తాము నష్టపోతున్నామని...
By Pagadala Venkateswar 2026-02-02 07:25:32 0 175
Andhra Pradesh
మదనపల్లి లో శ్రీ శక్తి ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహణ.
మదనపల్లె బెసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం స్త్రీ శక్తి ప్రోగ్రాం నిర్వహించారు....
By Pagadala Venkateswar 2026-04-13 12:25:41 0 196
Andhra Pradesh
మొహరం సందర్భంగా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి మహోన్నత త్యాగానికి చిహ్నం మొహరం సమాజంలో శాంతి కరుణ సత్యం కోసం...
By Benguluri Madhubabu 2026-06-26 06:21:22 0 154
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com