మహిళల సమస్యలకు మంగళవారం ప్రత్యేక వేదిక గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం - ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి

1
125

మహిళల సమస్యలకు మంగళవారం ప్రత్యేక వేదిక గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం - ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు

మహిళల ఫిర్యాదుతో నైట్ బీట్ ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని శివారు ప్రాంతంలో గంజాయి వినియోగం, విక్రయాల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని మహిళలు ఫిర్యాదు చేయగా, వెంటనే పోలీసులను అప్రమత్తం చేసి నైట్ బీట్ కానిస్టేబుళ్ల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయించడంతో ఆ సమస్యకు పరిష్కారం లభించిందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు పేర్కొన్నారు. మంగళవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మహిళా గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు శ్రీమతి గళ్ళా మాధవి గారు మహిళల నుంచి వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టారు.

అనంతరం ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు మీడియాతో మాట్లాడుతూ... ప్రతి మంగళవారం మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ గ్రీవెన్స్ కార్యక్రమం మహిళలకు తమ సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకునే వేదికగా మారిందని తెలిపారు.

మహిళలు చిన్న సమస్య అయినా, పెద్ద సమస్య అయినా నేరుగా వచ్చి తమ సమస్యను వివరించే పరిస్థితి ఏర్పడిందని, వాటి పరిష్కారానికి పశ్చిమ కార్యాలయం పూర్తిస్థాయిలో కృషి చేస్తోందని పేర్కొన్నారు. సమస్యను వినడమే కాకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి, పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు నిరంతరం ఫాలో అప్ చేస్తున్నామని చెప్పారు.

పారిశుద్ధ్య సమస్యలపై ఫిర్యాదులు అందాయని, ఒక ఆహార విక్రయ కేంద్రం కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న విషయాన్ని వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు.

అదేవిధంగా వైన్ షాపుల వద్ద ఆకతాయిల వేధింపులు, తగినంత వీధి దీపాలు లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి, అదనపు లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు పోలీసు పహారా పెంచినట్లు తెలిపారు. మహిళలు భద్రంగా రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

మహిళల ఆర్థిక మోసాలు, చీటీ పేరుతో మోసపోవడం, ఒంటరిగా నివసించే వృద్ధ మహిళల ఆస్తులను కబ్జా చేయాలనే ప్రయత్నాలు, కుటుంబ సమస్యలు, దొంగతనాలు వంటి అంశాలు కూడా తమ దృష్టికి వస్తున్నాయని వెల్లడించారు. ఇలాంటి ప్రతి అంశాన్ని సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు.

విద్యార్థినుల నుంచి కూడా పలు సమస్యలు వస్తున్నాయని, మంచి ర్యాంకులు వచ్చినప్పటికీ కొన్ని కళాశాలలు ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదా ఇతర కారణాలు చూపి సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాయని తెలిపారు. అలాంటి కళాశాలల యాజమాన్యాలతో నేరుగా మాట్లాడి విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఆర్థికంగా వెనుకబడిన మహిళలు, యువతులకు స్కిల్ డెవలప్‌మెంట్ అవకాశాలు కల్పించడం, పీ-4 కార్యక్రమం ద్వారా పుస్తకాలు, బ్యాగులు, విద్యకు అవసరమైన ఇతర సామగ్రి అందించడం వంటి కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయని వివరించారు.

Search
Categories
Read More
Delhi - NCR
Delhi-NCR Expands Women and Child Welfare Initiatives
Delhi-NCR continues to strengthen women and child welfare through expanded healthcare, education,...
By Fathima Safa 2026-07-02 06:24:07 0 227
SURAKSHA
Dr. N. Yuvaraj IAS: Leading Innovation and Industrial Growth
A distinguished Andhra Pradesh cadre IAS officer whose leadership in industrial development,...
By Lokeshwari Panthadi 2026-07-16 08:48:31 0 214
Telangana
దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆందోళన
కరీంనగర్‌లో రోజురోజుకీ దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆందోళన...
By Ponnala Srinivasrao 2026-05-09 02:16:23 0 164
Andhra Pradesh
దర్శి టీడీపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు
దర్శి టీడీపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు :  ఉదయం : 11.00 గంటలకు...
By Chennaiah Kati 2026-07-14 04:35:56 0 111
Andhra Pradesh
మదనపల్లెలో భార్యాభర్తలపై చీటింగ్ కేసు నమోదు.
మదనపల్లె మండలం చిప్పిలిలో అంగన్వాడీ టీచర్‌ను బంగారం పేరుతో మోసం చేసిన భార్యాభర్తలపై పోలీసులు...
By Pagadala Venkateswar 2026-03-26 05:42:12 0 199
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com