నేడు నంద్యాల జిల్లా బనగానపల్లెలో సీఎం చంద్రబాబు ప‌ర్య‌ట‌న‌.. రైతులకు భూ హక్కుల పండుగ.

0
109

 

 

'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాల పంపిణీ

22-ఏ నిషేధిత జాబితా నుంచి 2074 ఎకరాలకు విముక్తి కల్పిస్తూ ఉత్తర్వులు

చుక్కల భూముల సమస్యకు కూడా పరిష్కారం చూపుతున్న ప్రజా ప్రభుత్వం

దశాబ్దాలుగా నలుగుతున్న రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం

దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలకు చరమగీతం పాడేందుకు ప్రజా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రైతుల భూములకు సంపూర్ణ హక్కులు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు నంద్యాల జిల్లా బనగానపల్లెలో పర్యటించ‌నున్నారు. ఈ పర్యటన ద్వారా వేలాది ఎకరాల భూములకు నిషేధిత జాబితాల నుంచి విముక్తి కల్పించి, రైతులకు శాశ్వత హక్కు పత్రాలను అందజేయనున్నారు.

 

ఈ పర్యటనలో భాగంగా బేతంచర్ల మండలం గుటుపల్లి గ్రామానికి చెందిన 897 మంది రైతులకు ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. దశాబ్దాలుగా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్న 2074 ఎకరాల భూమిని 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం చంద్రబాబు తన సమక్షంలోనే ఈ భూములను నిషేధిత జాబితా నుంచి ఆన్‌లైన్‌లో తొలగించి, సంబంధిత రైతులకు హక్కు పత్రాలను స్వయంగా అందజేయనున్నారు. తమ సొంత భూమిపై అమ్ముకునే హక్కు గానీ, రుణాలు పొందే అవకాశం గానీ లేక ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతులకు ఇది చరిత్రాత్మక క్షణంగా నిలవనుంది.

Search
Categories
Read More
Dadra &Nager Haveli, Daman &Diu
Monsoon Update: Heavy Rain Expected Across DNH & Daman
The India Meteorological Department (IMD) has officially confirmed the onset of the monsoon...
By Lokeshwari Panthadi 2026-06-27 09:54:55 0 180
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:34:32 0 103
Andhra Pradesh
అన్నమయ్య: రోడ్డు ప్రమాదాల కట్టడికి పకడ్బందీ చర్యలు.
అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ ధీరజ్ శుక్రవారం పోలీస్, రవాణా, ఆర్ అండ్ బి,...
By Pagadala Venkateswar 2026-06-06 05:39:47 0 127
Andhra Pradesh
బాపట్ల పట్టణ శివారు చింతా వారి పాలెం వద్ద వరి కుప్ప దగ్దం గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించి పరారైన వైనం..
బాపట్ల పట్టణ శివారు చింతా వారి పాలెం వద్దవరి కుప్ప దగ్దం...  గుర్తు తెలియని వ్యక్తులు...
By Gadiyapudi Narendra 2026-01-06 11:10:33 0 470
Andhra Pradesh
పుంగనూరులో తాండవిస్తున్న అంధకారం
పుంగనూరు పట్టణంలోని ఎన్ఎస్ పేట, కట్టకింద పాలెం, బ్రాహ్మణ వీధి, కుమార్ వీధి, మొదిన్ నాయక్ వీధి...
By Kothuru Murali 2026-05-27 14:39:07 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com