432 రైతులకు భూహక్కుల పాస్ పుస్తకాలు ఎమ్మెల్యే సౌమ్య పంపిణీ

0
244

'మీ భూమి – మీ హక్కు' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

 

నందిగామ, జూలై 6 భారత్ అవాజ్ :

నందిగామ మండలం లాచపాలెం గ్రామంలో ఆదివారం నిర్వహించిన 'మీ భూమి – మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా రీసర్వే ప్రక్రియ పూర్తయిన అనంతరం 432 మంది రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన భూ హక్కుల పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య రైతులకు పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల సంక్షేమం, భూ హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.రీసర్వే ప్రక్రియ ద్వారా భూ యాజమాన్యానికి సంబంధించిన సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, రైతులకు తమ భూములపై స్పష్టమైన హక్కులు, పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

భూ హక్కుల పాస్ పుస్తకాలు అందుకున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ, పారదర్శకంగా రీసర్వే నిర్వహించి తక్కువ సమయంలో పాస్ పుస్తకాలు అందించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, గ్రామస్థులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాలలో స్టాక్ మార్కెట్ పేరిట భారీ మోసం
స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి, ఒక...
By Vadlamudi NagaVenkat 2026-03-14 10:54:17 0 836
Maharashtra
Bombay High Court: Speed Up Sony–Tata Play Case!
The Bombay High Court has asked the telecom tribunal (TDSAT) to quickly resolve the dispute...
By Bharat Aawaz 2025-06-25 12:54:58 0 2K
Andhra Pradesh
మాజీ సైనికుల ఆధ్వర్యంలో అలాయ్ బలాయ్ కార్యక్రమం
సైనికులు సర్వ మతాలను గౌరవించుకునే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ, కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా...
By Vadlamudi NagaVenkat 2026-03-21 05:42:26 0 648
Andhra Pradesh
మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్
AP: అల్లూరి జిల్లా డుంబిరిగుడ మండలం పెదపాడు గ్రామాన్ని గతేడాది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...
By SivaNagendra Annapareddy 2026-06-12 14:51:32 0 381
Andhra Pradesh
తేది:23.06.2026, మార్కాపురం గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి లో ఈనెల 27వ తేదీన జరగనున్న సీఎం పర్యటన ఏర్పాట్లపై
 గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి లో ఈనెల 27వ తేదీన జరగనున్న సీఎం పర్యటన ఏర్పాట్లపై...
By Chennaiah Kati 2026-06-24 15:34:54 0 162
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com