విద్యార్థులు మొబైల్ ని వీడి చదువుపై దృష్టి సారించాలి

0
818

గూడూరు జెడ్‌పీ సెకండరీ బాలికల పాఠశాలలో షీ టీం ఆధ్వర్యంలో బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమం 

-  షీ టీం ఎస్‌ఐ కుమారి సునంద గారు, గూడూరు పోలీస్ స్టేషన్ SHO గిరిధర్ రెడ్డి గారితో సంయుక్తంగా విద్యార్థినులకు సైబర్ భద్రత, భరోసా సేవలు, మైనర్ డ్రైవింగ్, డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన

మహబూబాబాద్ ::గూడూరు మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాల, గూడూరులో బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమమును మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ డాక్టర్ పి శబరీష్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో షీ టీం ఎస్‌ఐ కుమారి సునంద గారు మరియు గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గిరిధర్ రెడ్డి గారు సంయుక్తంగా పాల్గొని విద్యార్థినులకు షీ టీం సేవలు, భరోసా కేంద్రం అందిస్తున్న సేవలు, వాటి ప్రాముఖ్యత, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలు, మత్తు పదార్థాలు మరియు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ శాఖ సేవలను వినియోగించుకోవాలని, ఏవైనా వేధింపులు లేదా నేరాలు ఎదురైన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మహబూబాబాద్ షీ టీం నెంబర్8712656935, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100/112, సైబర్ మోసాల ఫిర్యాదుల కోసం1930 హెల్ప్ లైన్ నెంబర్లను వినియోగించుకోవాలని కోరారు. విద్యార్థినులు చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించి సురక్షిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాల హెడ్మాస్టర్ సుజాత మేడం, జిల్లా పరిషత్ సెకండరీ బాలుర పాఠశాల హెడ్మాస్టర్ సత్యనారాయణ సార్ మరియు అధ్యాపక బృందం 300 మంది విద్యార్థిని విద్యార్థులు, షీ టీం సిబ్బంది రమేష్ ,పార్వతి, భరోసా సిబ్బంది జోష్ణ పార్వతి తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు గారి ఆదేశాల మేరకు....
చీరాల: ఈ రోజు మంగళవారం సాయంత్రం 5:00 గంటలకు రామకృష్ణాపురం క్యాంపు కార్యాలయం నందు చీరాల వైఎస్ఆర్...
By Gadiyapudi Narendra 2026-02-17 16:01:03 0 364
Telangana
‎నీ బిడ్డ ఎంత మందితో తిరిగిందో ఏమో..!బండి సంజయ్ దిగజారుడు వ్యాఖ్యలు
17 ఏళ్ల మైనర్ బాలిక, పోక్సో కేసు బాధితురాలి గురించి బండి సంజయ్ దిగజారుడు వ్యాఖ్యలు ‎బండి...
By Ponnala Srinivasrao 2026-05-12 01:19:21 0 157
SURAKSHA
Ashish Kundra: Driving Governance with Vision and Innovation
A distinguished 1996-batch AGMUT cadre IAS officer whose administrative excellence,...
By Kalaga Sailaja 2026-07-24 12:01:56 0 143
Himachal Pradesh
Tragedy on Taklech-Kashapat Road: Six Lives Lost in Shimla
A devastating road accident in the Shimla district has left the community in mourning after a...
By Lokeshwari Panthadi 2026-06-27 09:03:18 0 143
SURAKSHA
AP పోలీసులు నేడు: విధి దాటి సమాజ సేవ చేస్తున్నారు
నేడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు విధి గంటలు దాటి ప్రజలకు సేవ చేశారు. విజయవాడ, విశాఖ, రాయలసీమ గ్రామాల్లో...
By Kalaga Sailaja 2026-07-04 08:26:34 0 91
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com