బీడీఎల్ రాకతో దొనకొండకు మహర్దశ.

0
89

బీడీఎల్ రాకతో దొనకొండకు మహర్దశ.

మంత్రి లోకేష్ గారికి కృతజ్ఞతలు.డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

దొనకొండ మండలం ఇండస్ట్రియల్ కారిడార్ లో జిల్లా కలెక్టర్ పి. రాజబాబు గారి తో కలిసి శుక్రవారం దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ డి.ఆర్.డి.ఏ అధికారులతో పర్యటించారు.

ఈ సందర్భంగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధతో వెనుకబడిన దొనకొండలో పారిశ్రామిక అభివృద్ధికి బీడీఎల్ ప్రాజెక్టు ఏర్పాటుకు చొరవ తీసుకోవడం ఆయనకు ప్రత్యేకంగా దర్శి ప్రాంత ప్రజానీకం తరుపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

బిడిఎల్ రాకతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడునున్నాయని డాక్టర్ లక్ష్మీ తెలిపారు.

వందలాది మంది నిరుద్యోగులకు బీడీఎల్ పరిశ్రమ ద్వారా ఉపాధి లభిస్తుంది అన్నారు.

ఇందుకు అవసరమైన భూమిని ప్రభుత్వం అందించేందుకు జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని తొలి అడుగు వేయడం అభినందనీయమన్నారు.

వెంటనే బీడీఎల్ పరిశ్రమకు అవసరమైన భూమిని అందించేందుకు అడ్డంకులు తొలగించి ముందుకు వెళ్లాలన్నారు.

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా దొనకొండలో వలసలు నివారించి అభివృద్ధి వైపు అడుగులు వేసే దిశగా గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు, ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖమాత్యులు నారా లోకేష్ బాబు గారు చేస్తున్న కృషిని అందరం అభినందించాలన్నారు.

రాబోయే ఐదేళ్లలో దొనకొండ దశ దిశ మార్చే లక్ష్యంగా బీడీఎల్ పరిశ్రమ ఏర్పాటు జరుగుతుందన్నారు.

ఇందుకు సహకరిస్తున్న అధికార యంత్రాంగానికి ప్రజలకు డాక్టర్ లక్ష్మీ కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లా కలెక్టర్ రాజబాబు మాట్లాడుతూ.. ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధతో దొనకొండలో బీడీల్ ప్రాజెక్టుకు అవసరమైన స్థలాన్ని అందించాలని కోరడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే డి.ఆర్.డి.ఏ అధికారులతో స్థల పరిశీలన చేయడం జరిగిందని వెంటనే స్థలాన్ని వారికి ఇవ్వడం జరుగుతుందన్నారు . బీడీఎల్ ద్వారా ప్రత్యక్షంగా 500 మందికి పరోక్షంగా అనుబంధ పరిశ్రమల ద్వారా రెండు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని తద్వారా ఉపాధి జరుగుతుందన్నారు. అందులో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి కృషి కూడా ఉందని కలెక్టర్ తెలిపారు. వెంటనే స్థలాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను కోరారు.

ఈ కార్యక్రమం లో దొనకొండ మండల టిడిపి అధ్యక్షులు మోడీ ఆంజనేయులు, నాగులపాటి శివకోటేశ్వర రావు, కామేపల్లి చెంచయ్య, మోడీ ఆంజనేయులు, రమణ యాదవ్, దొనకొండ మండలం మరియు నియోజకవర్గం లోని వివిద హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పర్యాటకులకు ప్రత్యేక యాప్ ఆంధ్ర టాక్సీలో హాయి హాయిగా వివరిద్దాం
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 25, 2025*...
By Rajini Kumari 2025-12-25 11:20:25 0 316
SURAKSHA
Breaking Barriers: The Visionary Leadership of Anu Garg
A Trailblazer at the Helm: Odisha’s First Woman Chief Secretary:  History is often...
By Kalaga Sailaja 2026-07-18 07:48:31 0 138
Andhra Pradesh
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించి
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్...
By Chennaiah Kati 2026-01-24 06:12:22 0 235
Andhra Pradesh
పోలీసునని నమ్మించి కారు కజేసిన యువకుడు
BHARAT AAWAZ న్యూస్  పోలీసునని నమ్మించి కారు కాజేసిన యువకుడు  కళ్యాణదుర్గం, తాను...
By Chennaiah Kati 2026-06-10 06:58:51 0 132
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలోకి చేరికలు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, చీకల చేను గ్రామానికి చెందిన పలు టీడీపీ కుటుంబాలు గురువారం...
By Kothuru Murali 2026-03-06 11:26:17 0 209
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com