దళిత, క్రైస్తవ సోదరుల హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి నిరంతరం కట్టుబడి ఉంటాం

0
97

దళిత, క్రైస్తవ సోదరుల హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి నిరంతరం కట్టుబడి ఉంటాం...

ఈరోజు మార్కాపురంలో ఎమ్మార్పీఎస్ (MRPS) అనుబంధ సంఘాలైన మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (MEF), మహాజన సోషల్ పార్టీ (MSP), దళిత క్రిస్టియన్ ఐక్యవేదిక ప్రతినిధులు మరియు స్థానిక చర్చి పాస్టర్లు నన్ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఈ భేటీలో MEF జాతీయ అధ్యక్షులు బొంత ఏసుదాసు గారు, రాష్ట్ర అధ్యక్షులు బిక్షాలు గారు, ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు కత్తి ఐజాక్ గారు, MSP జాతీయ ఉపాధ్యక్షులు ఎలగంటి నర్సింగ్ గారు, ఇతర ముఖ్య నాయకులు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

గతంలో (01-07-2026న) చారిత్రాత్మక ఏబీఎం (ABM) హైస్కూల్ భూములను ఆక్రమణల నుండి కాపాడి, తిరిగి పాఠశాలను విజయవంతంగా ప్రారంభించేలా ప్రభుత్వం ద్వారా తీసుకున్న చొరవ పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తూ, కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని దళిత, క్రైస్తవ సోదరులకు ఏ కష్టం వచ్చినా వారికి అండగా నిలబడటం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత అని తెలియజేశాను. సమాజంలోని ప్రతి పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తానని ఈ సందర్భంగా వారికి భరోసా ఇచ్చాను.

Search
Categories
Read More
Telangana
భైరవునిపల్లి గ్రామ పంచాయతీ సభ్యులకు పొంగులేటి క్యాంప్ నుంచి అభినందనలు...
ఇటివల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలో టీడీపీ, సీపీఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్ధి గుండపనేని...
By Krishna Balina 2025-12-16 18:37:59 0 314
SURAKSHA
Kalaivanan S., IPS: Advancing Excellence in Policing
The Journey begins "The strength of a police force is measured by the confidence...
By Fathima Safa 2026-07-27 13:22:05 0 177
Andhra Pradesh
నాయుడు కాలనీలో మొక్కలు నాటిన బేబినాయన
మాజీమంత్రి వాసిరెడ్డి కృష్ణమూర్తినాయుడు జయంతి సందర్భంగా ఆదివారం బొబ్బిలిలోని నాయుడుకాలనీలో...
By Boiena Rajesh 2026-08-16 10:12:16 0 112
Andhra Pradesh
గ్రూప్-2 ఫలితాలలో విజయం సాధించిన మన ఆళ్లగడ్డ కీర్తిని రాష్ట్ర స్థాయిలో చాటిన నలుగురు అభ్యర్థులు
గ్రూప్-2 ఫలితాల్లో విజయం సాధించి, మన ఆళ్లగడ్డ కీర్తిని రాష్ట్రస్థాయిలో చాటిన నలుగురు అభ్యర్థులకు...
By Chennaiah Kati 2026-02-04 08:30:23 0 265
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ భాష ఆదేశాల మేరకు సచివాలయంలో రమేష్ రెడ్డి తనిఖీ. ప్రజల సమస్యల పరిష్కారం, సదరం స్లాట్ బుకింగ్, ఓటరు నమోదుపై సమీక్ష.
మదనపల్లె: గురువారం మదనపల్లె శాసనసభ్యులు మహమ్మద్ షాజహాన్ భాష ఆదేశాల మేరకు 35వ వార్డు టీడీపీ...
By Pagadala Venkateswar 2026-07-10 06:48:23 0 127
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com