కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జూలై 1 నుండి 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు జిల్లా ఎస్పీ నితిక పంత్

0
271

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల దృష్ట్యా, ప్రశాంత వాతావరణ పరిస్థితులను మరింత సవ్యంగా కొనసాగించడానికి జూలై 01 వ తేదీ నుండి జూలై 31 వ తేదీ వరకు జిల్లా అంతటా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ నితిక పంత్ ఐపీఎస్ బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు. 30 పోలీస్ యాక్ట్-1861 అమల్లో ఉన్నందున జిల్లాలో డీఎస్పీ/ఏఎస్పీ లేదా ఆపై పోలీస్ ఉన్నతాధికారుల నుండి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, బహిరంగ సభలు, తదితర ప్రజలు గుమిగూడి ఉండేవిధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేయరాదని తెలిపారు. నిషేధిత ఆయుధాలు, దురుద్దేశంతో నేరాలకు ఉసికొలిపే ఎటువంటి ఆయుధాలు కలిగిఉండరాదని తెలిపారు. ప్రజా జనజీవనానికి ఇబ్బంది, చిరాకు కలిగించేందుకు దారితీసే ఇబ్బందికర ప్రజా సమావేశాలు, జన సమూహం అలాంటివి పూర్తిగా నిషేధం అన్నారు. చట్టపరమైన జారీచేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం శిక్షార్హులు అవుతారని సూచించారు. నిషేధంలో ఉన్న నిబంధనలను తప్పనిసరిగా అందరూ పాటించాలన్నారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా ముందస్తుగా దరఖాస్తు చేసుకొని అనుమతులు తీసుకోవాలని సూచించారు. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున ఎటువంటి అనుమతులు లేని ర్యాలీలు నిర్వహించిన వారిపై కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గుడిమెట్లలో ఘనంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
    భక్తిశ్రద్ధలతో పాతపాటి అంకమ్మ, నీలగిరి అంకమ్మ, గంగమ్మ, కాటమరాజు విగ్రహాల...
By Patan Khuddus 2026-05-08 11:45:54 0 321
International
35+ People died in Iran.
There are big strikes going against Govt of Iran due to Huge hikes in Rates and also decrease of...
By Terli Ashok 2026-01-07 14:38:30 0 402
SURAKSHA
సైబర్ మోసాల నివారణకు ఏపీ పోలీసుల ప్రత్యేక అవగాహన సదస్సు
 పెరుగుతున్న సైబర్ నేరాల దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిన్న పలు ప్రాంతాల్లో ప్రత్యేక...
By Kalaga Sailaja 2026-06-27 06:59:39 0 80
Andhra Pradesh
శ్రీ అభయాంజనేయ స్వామి వార్షిక తిరుణాల మహోత్సవంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి మండలం అబ్బవరం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వార్షిక తిరుణాల మహోత్సవ...
By Benguluri Madhubabu 2026-03-21 07:34:56 0 260
Andhra Pradesh
రోడ్డు భద్రతపై కురుపాం పోలీసుల అవగాహన
కురుపాం పోలీసుల ఆధ్వర్యంలో సాయిబాబా గుడి సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించి వాహనదారులకు రోడ్డు...
By Boiena Rajesh 2026-08-26 11:19:05 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com