స్కూల్ బుక్ స్టాల్‌ వద్ద USFI, PDSU, DSFI ఆందోళన

0
326

మహబూబాబాద్:: డోర్నకల్ పట్టణంలోని బ్రిలియంట్ స్కూల్‌లోఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న బుక్ స్టాల్‌పై USFI, PDSU, DSFI విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం అక్రమంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, టైలు, బెల్టులు, హాస్టల్ సామగ్రి విక్రయిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతోందని నాయకులు ఆరోపించారు.

నిరుపేదలకు సేవలందించే సంస్థ పేరుతో అధిక ఫీజులు వసూలు చేయడం, పుస్తకాలు, యూనిఫాంలను బలవంతంగా కొనుగోలు చేయించే విధానాన్ని వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఇదే పాఠశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న ప్రైమరీ వండర్ కిడ్స్ పాఠశాలను కూడా సీజ్ చేయాలని కోరారు.
ఈ సందర్భంగా USFI రాష్ట్ర ఉపాధ్యక్షులు మాళోత్ శాంతికుమార్,PDSU జిల్లా కార్యదర్శి బోనగిరి.మధు,DSFI రాష్ట్ర కార్యదర్శి కె.సాయికుమార్ మాట్లాడుతూ.... నిబంధనలను ఉల్లంఘిస్తున్న బ్రిలియంట్ పాఠశాల గుర్తింపును వెంటనే రద్దు చేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల ఫిర్యాదులను విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదని నాయకులు ఆరోపించారు. జిల్లా విద్యాశాఖ అధికారి (DEO), మండల విద్యాశాఖ అధికారి (MEO)లకు మూడు గంటల పాటు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదని, కాల్స్ కూడా లిఫ్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రుల హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని USFI, PDSU, DSFI నాయకులు స్పష్టం చేశారు.

References

Search
Categories
Read More
Andhra Pradesh
బ్రహ్మర్షి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.
మదనపల్లె పట్టణంలోని బ్రహ్మర్షి స్కూల్ యాజమాన్యం విద్యార్థులతో నీళ్లు మోయిస్తున్న ఘటనపై విమర్శలు...
By Pagadala Venkateswar 2026-04-08 05:40:16 0 162
Kerala
Education Reforms and Digital Learning Growth in Kerala
Kerala is strengthening its education sector through comprehensive reforms and the expansion of...
By Fathima Safa 2026-06-17 11:51:53 0 116
Telangana
రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తో కలిసి కాచిగూడ -భగవతి రైల్ వే స్టేషన్ కు మొదటి రైలు ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్ జిల్లా/కాచిగూడ.  రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో కలిసి కేంద్ర బొగ్గు గనుల శాఖ...
By Sidhu Maroju 2025-07-19 17:13:19 0 1K
Andhra Pradesh
రెండేళ్లుగా తిరుగుతున్నా.. కలెక్టరేట్ వద్ద తల్లీబిడ్డల రోదన.
మదనపల్లె కలెక్టరేట్ వద్ద సోమవారం గోళ్లపల్లికి చెందిన రాజమ్మ తన దివ్యాంగుడైన కుమారుడు మనోహర్...
By Pagadala Venkateswar 2026-03-16 10:04:40 0 186
SURAKSHA
Shri Ronald Rose, IAS: Champion of People-Centric Governance
From Grassroots Governance to Citizen-Centric Administration—An IAS Officer Dedicated to...
By Lokeshwari Panthadi 2026-07-09 09:17:21 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com