కష్టకాలంలో చేయూత.. లబ్ధిదారులకు చెక్కులు.|

0
145

"రూ.21.63 లక్షల ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి."

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 53 మందికి రూ.21.63 లక్షల విలువైన చెక్కులను ఆయన అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం రిలీఫ్ ఫండ్ పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య అత్యవసర పరిస్థితుల్లో ఎంతో ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబిత అనిల్ కిషోర్ గౌడ్ లతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
DSP గారిని కలిసిన రాజీవ్ రెడ్డి
    ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలో నిర్వహించబడుతున్న శ్రీశ్రీశ్రీ లక్ష్మీ...
By Boya Dasthagiri 2026-03-26 09:54:06 0 344
Andhra Pradesh
మహిళా శక్తిని కించపరిచే సంస్కృతికి ప్రజాస్వామ్యంలో స్థానం లేదు
మహిళా శక్తిని కించపరిచే సంస్కృతికి ప్రజాస్వామ్యంలో స్థానం లేదు  సామాన్య కుటుంబం నుంచి...
By Chennaiah Kati 2026-06-17 00:48:03 0 103
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా: పోలీసుల స్పెషల్ వీడియో
అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగం మహిళల భద్రతకు పెద్దపీట వేస్తోంది. ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు...
By Pagadala Venkateswar 2026-03-07 09:24:08 0 195
BMA
Vernacular Media: Battling Algorithms for Digital Reach
As India’s internet user base rapidly expands into rural communities, over 98 percent of...
By JoinBMA 2026-08-21 08:01:26 0 51
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com