కొమురం భీమ్ చౌక్ వద్ద తప్పిన ప్రమాదం. రంగంలోకి మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు

0
197

🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ 

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కొమురం భీమ్ చౌక్ వద్ద ఒక పెద్ద విద్యుత్ ప్రమాదం తృటిలో తప్పింది. కొమురం భీమ్ జంక్షన్ నుండి కలెక్టరేట్ వరకు ఉన్న ప్రధాన రహదారి డివైడర్ స్ట్రీట్ లైట్ల కనెక్షన్ వైరు ప్రమాదకరంగా డ్యామేజ్ కావడాన్ని గమనించిన స్థానికులు, వెంటనే మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. దీనిపై తక్షణమే స్పందించిన మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ ఎండి అహ్మద్, మరియు మున్సిపల్ కమిషనర్ అంజయ్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన అధికారులు మున్సిపల్ విద్యుత్ సిబ్బందితో పాటు విద్యుత్ విభాగం అధికారులను, సిబ్బందిని వెంటనే రంగంలోకి దించారు. అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో విద్యుత్ శాఖ సిబ్బంది యుద్ధప్రాతిపదికన పనిచేసి, డ్యామేజ్ అయిన విద్యుత్ వైరుకు తక్షణమే మరమ్మత్తులు పూర్తి చేసి పెద్ద ప్రమాదాన్ని అడ్డుకున్నారు. మున్సిపల్ మరియు విద్యుత్ యంత్రాంగం ఇంత వేగంగా స్పందించి ముప్పు తప్పించడం పట్ల ఆసిఫాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ బాలకృష్ణ, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మన్యం, విజయనగరం జిల్లాలకు Yellow Alert
రాబోయే మూడు గంటల్లో పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై, చెదురుమదురుగా...
By Boiena Rajesh 2026-06-18 05:15:07 0 200
Andhra Pradesh
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు: 8 మందికి రూ.10 వేల చొప్పున జరిమానా
చీరాల: చీరాల ఒకటో పట్టణ ట్రాఫిక్ ఇంచార్జి ఎస్సై పవన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్...
By Gadiyapudi Narendra 2026-02-07 17:30:15 0 215
SURAKSHA
Vijaya K IAS: Empowering Governance Through Dedicated Leadership
A distinguished 2013-batch Andhra Pradesh cadre IAS officer known for transparent governance,...
By Lokeshwari Panthadi 2026-07-16 10:42:33 0 141
Andhra Pradesh
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విశ్వరూప సందర్శన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు
ప్రచురణార్థం :- 20-01-2026   *శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి విశ్వరూప సందర్శన...
By Rajini Kumari 2026-01-20 10:48:26 0 221
SURAKSHA
సైబర్ నేరాల నివారణ - అవగాహన
చిత్రంలో చూపినట్లుగా, సమాజంలో పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం ఎంతో అవసరం....
By Kalaga Sailaja 2026-06-29 07:53:08 0 256
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com