అల్వాల్‌లో నీటి కష్టాలు.. ప్రభుత్వంపై బీజేపీ ఫైర్.|

0
237

"HMWSSB ట్యాంకర్లు వారానికి ఒకసారి కూడా రావడం లేదని కె. శ్రీనివాస్ వర్మ ఆరోపణ."

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : అల్వాల్ ప్రాంత ప్రజలు తీవ్ర తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పరిస్థితి రోజురోజుకూ మరింత దిగజారుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె. శ్రీనివాస్ వర్మ ఆరోపించారు.

శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, HMWSSB ద్వారా బుక్ చేసుకున్న నీటి ట్యాంకర్లు వారానికి ఒకసారి కూడా సకాలంలో అందడం లేదని అన్నారు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటడంతో ప్రైవేట్ ట్యాంకర్లు కూడా అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

రోజువారీ నీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, ప్రజల దాహం తీర్చడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని శ్రీనివాస్ వర్మ విమర్శించారు. సరైన ప్రణాళిక, పర్యవేక్షణ లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని అన్నారు.  

ఇంకుడు గుంతల ఏర్పాటుపై నిర్లక్ష్యం, చెరువుల పూడికతీత చేపట్టకపోవడం వల్ల అల్వాల్‌తో పాటు హైదరాబాద్‌లోని అనేక కాలనీల్లో భూగర్భ జలాలు అడుగంటాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని, HMWSSB ద్వారా నీటి ట్యాంకర్ల సంఖ్యను వెంటనే పెంచాలని శ్రీనివాస్ వర్మ డిమాండ్ చేశారు. 

కనీసం రెండు రోజులకోసారి ప్రతి ప్రాంతానికి ట్యాంకర్ ద్వారా తాగునీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు సకాలంలో తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పల్లె పండగ 2.0 కు శ్రీకారం
*పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పల్లె పండుగ-2.0కు శ్రీకారం*   *గ్రామ సీమల అభ్యున్నతికి పవన్ కళ్యాణ్...
By Rajini Kumari 2026-01-02 12:31:21 0 266
Bihar
CM Walks to Office in Major Fuel-Saving Drive
Patna: In a striking display of austerity, Bihar Chief Minister Samrat Choudhary walked 500...
By Dunna Jessicaruth 2026-05-16 05:27:31 0 124
Telangana
మల్కాజిగిరిలో కాంగ్రెస్ శక్తి ప్రదర్శన… కార్యకర్తల సమావేశంతో నూతన ఉత్సాహం!”|
మేడ్చల్ మల్కాజిగిరి : మల్కాజిగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శక్తిని మరింత బలోపేతం చేసే దిశగా...
By Sidhu Maroju 2026-03-22 09:04:00 0 243
Jammu & Kashmir
Apple Orchards in Ruins: Hailstorms Decimate Kashmir’s Fruit Economy
A catastrophic wave of unseasonal rain and severe hailstorms has ravaged the horticulture...
By Dunna Jessicaruth 2026-05-14 07:41:12 0 192
Andhra Pradesh
ఆర్డీటీ మనందరి సంస్థ.. రాజకీయాలకు అతీతంగా అండగా నిలుద్దాం: మంత్రి నారా లోకేష్.
    ఆర్డీటీ మనందరి సంస్థ.. రాజకీయాలకు అతీతంగా అండగా నిలుద్దాం: మంత్రి నారా లోకేష్...
By Pagadala Venkateswar 2026-05-15 06:19:25 0 140
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com