ఆటోలకు సీరియల్ నంబర్లు ఏర్పాటు* *ప్రతి సీరియల్ నెంబర్ ఆటో డ్రైవర్ల పేరు పోలీస్ స్టేషన్లో నమోదు* *ప్రయాణికులకు ధైర్యం కలిగించేలా పోలీస్ వ్యవస్థ* *ప్రజల భద్రతే లక్ష్యంగా వినూత్నంగా వ్యవహరించిన వేదులపల్లి ఎస్సై వెంకటేశ్వర్లు*

0
297

ప్రజల భద్రతే లక్ష్యంగా ప్రతి ఒక ఆటోకు ఒక సీరియల్ నెంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు ధైర్యం కలిగేలా పోలీస్ సిబ్బంది వ్యవహరించారు.ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించి, డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు వాహనంలో అందుబాటులో ఉంచాలని వేదులపల్లి ఎస్సై ఎం. వెంకటేశ్వర్లు సూచించారు.

వేదులపల్లి ప్రాంతంలో ఆటో డ్రైవర్లతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ ఉంటారని కొంతమంది ఆటో డ్రైవర్లు ప్రజలను ఎవరు ప్రయాణించని రహదారులకు తీసుకువెళ్లి ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేసి వారి వద్ద ఉన్న నగదు బంగారాన్ని కాజేసి ప్రయాణికులను మోసం చేస్తున్నారని అన్నారు.ఈ సందర్భంగా ఆటోలో ప్రయాణించే ప్రయాణికులకు భరోసాగా ప్రతి ఒక్క ఆటోకు సీరియల్ నెంబర్ ఏర్పాటు చేసి ఆటోలకు ఎదురు వెనుక అంటించామని, అలాగే ఆటో డ్రైవర్ సీటు వెనక వారి డీటెయిల్స్ తో బోర్డు ఏర్పాటు చేశామని, దానివల్ల ప్రయాణికులను ఎవరైనా మోసం చేయాలని చూసినా, ప్రయాణికులు ఆటోలులో ఏవైనా విలువైన వస్తువులు మర్చిపోయిన, పోలీస్ స్టేషన్ వద్దకి కంప్లైంట్ ఇవ్వడానికి రాగానే ఆటో డ్రైవర్లను గుర్తించేలా ఉపయోగపడుతుందని తెలిపారు.ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆటోల్లో అనుమతికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.

కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, స్థానిక సంఘ ప్రతినిధులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్... విద్యుత్ శాఖ...
భారత్అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా ఈరోజు విద్యుత్ శాఖలో ప్రమాదాలు జరగకుండా కావలసిన పరికరాలు...
By Gujile Ramu 2026-05-01 07:08:24 0 393
Andhra Pradesh
డోర్ టు డోర్ కార్యక్రమంలో నందవరం మండలం బిజెపి కిసాన్ మోజ్ అధ్యక్షుడు బోయ భీమయ్య
నందవరం మండలం హాలహరివి గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించి ప్రజలకు సంక్షేమం గురించి...
By Boya Dasthagiri 2026-08-20 03:02:55 0 151
Andhra Pradesh
మ్యుటేషన్లు సకాలంలో పూర్తి చచేయాలి: VZM కలెక్టర్
మ్యుటేషన్ కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి, సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్...
By Boiena Rajesh 2026-07-16 08:18:48 0 180
Bharat
Defence Acquisition COuncil Approves Proposal
The Defence Acquisition Council (DAC), led by Defence Minister Rajnath Singh, approved 10 major...
By Bharat Aawaz 2025-07-03 13:22:28 0 3K
Andhra Pradesh
క్రీడలలో సత్తా చాటిన బాపట్ల జిల్లా హెడ్ కానిస్టేబుల్. జాతీయ స్థాయిలో జరిగిన ఆల్ ఇండియా మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్–2026లో మూడు పతకాలు సాధించిన హెడ్ కానిస్టేబుల్ సిహెచ్.నాగరాజు
క్రీడలలో సత్తా చాటిన బాపట్ల జిల్లా హెడ్ కానిస్టేబుల్. జాతీయ స్థాయిలో జరిగిన ఆల్ ఇండియా...
By Gadiyapudi Narendra 2026-01-09 15:45:43 0 294
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com