డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి పౌరుడు బాధ్యతగా పనిచేయాలి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ పిలుపు

0
271

🎤 కొమురం భీం ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్, 

ఆసిఫాబాద్: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆసిఫాబాద్ పట్టణంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2K రన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతు. డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని, ప్రతి ఒక్కరూ వాటికి దూరంగా ఉండాలని సూచించారు. పాఠశాల దశ నుంచే విద్యార్థులు క్రమశిక్షణ, మంచి విలువలు అలవర్చుకొని, మాదకద్రవ్యాలు మరియు ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం, డ్రగ్స్ వినియోగం మరియు అక్రమ రవాణాను అరికట్టేందుకు సమాజాన్ని చైతన్యపరచడం, యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచే సందేశాన్ని ప్రతి ఇంటికి చేరవేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుండి 2K రన్  ఈ 2K రన్ కార్యక్రమం ఆసిఫాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుండి గాంధీ చౌక్ మీదుగా అంబేద్కర్ చౌక్ నుండి తిరిగి పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు ఉత్సాహంగా కొనసాగింది. వాల్ ఆఫ్ ప్రామిస్ పై సంతకాలు, అనంతరం ఏర్పాటు చేసిన వాల్ ఆఫ్ ప్రామిస్  పై జిల్లా ఎస్పీ, పోలీస్ అధికారులు, విద్యార్థులు డ్రగ్స్ నిరోధక సందేశాలు రాసి, సంతకాలు చేసి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి తమ మద్దతు ప్రకటించారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు ప్రజలు, విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు మరియు సమాజంలోని ప్రతి వర్గం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజల నుండి అందే అర్జీల్లో తక్షణం పరిష్కారం
గుంటూరు నగరపాలక సంస్థ ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్ కు అన్ని విభాగాల అధికారులు హాజరు కావాలని,...
By John Baji 2025-12-30 01:40:24 0 218
Tripura
Tripura Tightens School Oversight to Boost Education
In a major push to enhance primary education standards, the Tripura School Education Department...
By Lokeshwari Panthadi 2026-07-03 04:54:19 0 88
Haryana
Relief for Farmers: Early Sunflower Procurement Begins
The Haryana Agriculture and Farmers Welfare Department officially launched its sunflower...
By Dunna Jessicaruth 2026-05-25 06:00:51 0 97
Andhra Pradesh
ఘనంగా దుగ్గిరాల గోపాలకృష్ణ జయంతి
చీరాల N.R.& P.M. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రౌండ్ నందు ఆంధ్రరత్న శ్రీ దుగ్గిరాల...
By Vadlamudi NagaVenkat 2026-06-02 16:24:19 0 361
Telangana
సింగరేణి గుర్తింపు సంఘం AITUC తో చర్చలు జరిపిన సింగరేణి డైరెక్టర్ (పా) : గౌతమ్ పొట్రూ
తేదీ 12/05/2026 :హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో గుర్తింపు సంఘం అయిన సింగరేణి కాలరీస్...
By Avunoori Mahesh 2026-05-12 17:26:19 0 239
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com