డ్రగ్స్ యువత భవిష్యత్తును చీకటిలోకి నెడతాయి డాక్టర్ జి. రాజ్ కుమార్ యండి

0
318

సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ అవగాహన సదస్సుచీరాల 25 జూన్ 2026 : మాదకద్రవ్యాల వ్యసనం నేటి సమాజానికి, ముఖ్యంగా యువతకు పెను సవాలుగా మారిందని, డ్రగ్స్ అనే మాయాజాలంలో చిక్కుకున్న వ్యక్తి తన ఆరోగ్యం, విద్య, కుటుంబం, భవిష్యత్తును కోల్పోయే ప్రమాదం ఉందని డాక్టర్ జి.రాజ్ కుమార్ ఎం.డి. (పీడియాట్రిక్స్) నవజాత శిశు వైద్య నిపుణులు లతా హాస్పిటల్ అధినేత అన్నారు. జూన్ 26న నిర్వహించనున్న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు “మాదకద్రవ్యాలకు నో – జీవితానికి ఎస్” అనే అంశంపై గురువారం సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

కళాశాల కరస్పాండెంట్ శీలం విద్యాసాగర్, ప్రిన్సిపాల్ గారపాటి పుష్పరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రాజకుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు కేవలం ఒక వ్యక్తినే కాకుండా కుటుంబాలను, సమాజాన్ని, దేశ భవిష్యత్తును కూడా ప్రభావితం చేసే సామాజిక శాపమని అన్నారు. యువతలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం ఆందోళన కలిగించే అంశమని, దీనిని అరికట్టేందుకు అవగాహన, కుటుంబ పర్యవేక్షణ, విద్యాసంస్థల పాత్ర ఎంతో కీలకమని వివరించారు.

విద్యార్థి దశ జీవిత నిర్మాణానికి పునాది వంటిదని, ఈ దశలో మంచి స్నేహాలు, మంచి అలవాట్లు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అలవరచుకుంటేనే ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు. కొంతమంది చెడు ప్రభావాలకు లోనై మాదకద్రవ్యాల వైపు ఆకర్షితులవుతున్నారని, అలాంటి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని ‘నో’ చెప్పే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

మాదకద్రవ్యాల వల్ల మెదడు పనితీరు దెబ్బతినడం, మానసిక ఒత్తిడి పెరగడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, శారీరక ఆరోగ్యం క్షీణించడం వంటి అనేక దుష్పరిణామాలు ఎదురవుతాయని తెలిపారు. క్షణిక ఆనందం కోసం తీసుకునే నిర్ణయాలు జీవితాంతం బాధలకు కారణమవుతాయని హెచ్చరించారు.

కళాశాల కరస్పాండెంట్ శీలం విద్యాసాగర్ మాట్లాడుతూ, దేశాభివృద్ధికి యువతే మూలస్తంభమని, వారిని మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు విద్యాసంస్థలు నిరంతరం చైతన్య కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు తమ జీవిత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.

ప్రిన్సిపాల్ గారపాటి పుష్పరాజు మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు నైతిక విలువలను కూడా పెంపొందించుకోవాలని, సమాజంలో జరుగుతున్న దుష్ప్రభావాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో యువత ముందుండి పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించారు. “మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటాం. ఇతరులను కూడా చైతన్యపరుస్తాం. ఆరోగ్యవంతమైన, మాదకద్రవ్య రహిత భారతదేశ నిర్మాణానికి కృషి చేస్తాం” అని ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కార్యక్రమంలో పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపక సిబ్బంది

డాక్టర్ గారపాటి మంజుల,సుమ,చినపాప, పార్వతి,షీలా, గాస్పర్,

సుబ్బారావు,దుర్గ

యేసు రెడ్డి,

అధ్యాపకేతర సిబ్బంది నీలిమ,వినీల,జ్యోతి,ఆక్తర్ ఉన్నిసా జార్జి విన్సెంట్,

విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లో విషాద ఘటన
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో విషాద ఘటన...   పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం...
By Rajini Kumari 2025-12-23 10:06:39 0 218
SURAKSHA
K. Karthik IPS: A Rising Leader in Kerala Police Service
The Journey Begins "The strength of policing lies not in authority alone, but in the...
By Fathima Safa 2026-07-10 04:17:15 0 199
Goa
Infrastructure & Weather
A major explosion at the Amona 220kV substation early Friday plunged several areas of Sanquelim...
By Dunna Jessicaruth 2026-05-16 05:54:06 0 156
Telangana
World press day
ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా పాత్రికేయ సోదర, సోదరీమణులకు ముఖ్యమంత్రి శ్రీ ఎ....
By G k Nookala 2026-05-03 06:04:30 0 210
Andhra Pradesh
పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ: కలెక్టర్.
మదనపల్లిలో 2026-27 సంవత్సరానికి గాను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాత్రికేయులకు అక్రిడిటేషన్...
By Pagadala Venkateswar 2026-02-25 08:15:19 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com