పవన్ కల్యాణ్ ను కలిసిన రామ్ చరణ్..

0
94

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భేటీ

మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో సమావేశం

మర్యాదపూర్వకంగా బాబాయ్‌ ను కలిసిన రామ్ చరణ్

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కార్యక్రమం కోసం మంగళగిరికి వచ్చిన చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఈ సమావేశం జరిగింది. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రామ్ చరణ్ ఆయనను కలవడం ఇదే తొలిసారి.

 

అమరావతిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) వేడుకకు హాజరయ్యేందుకు రామ్ చరణ్ మంగళగిరి వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నేరుగా జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లి, తన బాబాయ్ పవన్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

 

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు రామ్ చరణ్ అభినందనలు తెలియజేశారు. అనంతరం వీరిద్దరూ కాసేపు ముచ్చటించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి, ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్‌ను రామ్ చరణ్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీకి సంబంధించిన ఛాయాచిత్రాలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Search
Categories
Read More
Andhra Pradesh
చిత్తూరు ఆపరేషన్స్ నాన్ కేడర్ ఎస్పీగా రాజశేఖర్ రాజు బాధ్యతలు స్వీకరణ
చిత్తూరు జిల్లాలో ఆపరేషన్స్ నాన్ కేడర్ ఎస్పీగా శ్రీ ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు బాధ్యతలు స్వీకరించారు....
By Kothuru Murali 2026-05-29 13:20:08 0 126
SURAKSHA
Hargobinder Singh Dhaliwal: Guardian of Island Security
The Journey Begins "A police officer's greatest achievement is not measured by the number of...
By Fathima Safa 2026-07-29 11:17:27 0 144
Andhra Pradesh
వేసవి జాగ్రత్తలు తప్పనిసరి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
బాపట్ల జిల్లా: జిల్లాలో మార్చి, ఏప్రిల్, మే, నెలల్లో ఎండలు తీవ్రత క్రమేపి పెరగనునుందని, దీనితో...
By Gadiyapudi Narendra 2026-03-05 18:05:23 0 506
Telangana
ఆగస్టు 5వ తేదీలోగా మిల్లరు బకాయిలు చెల్లించాలి.. :
mahabubabad: యాక్షన్ ప్యాడీ, సీఎంఆర్ బకాయి ఉన్న రైస్ మిల్లర్లు ఆగస్టు 5వ తేదీలోగా బకాయిలను...
By Bheeshman King 2026-07-08 12:33:20 0 1K
Andhra Pradesh
ఆకట్టుకున్న ఆదర్శ పాఠశాల అలంకరణ.
పెద్దమండ్యం బస్టాండ్ వద్దగల ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో 'మెగా పేరెంట్స్ మీటింగ్' సందర్భంగా చేసిన...
By Pagadala Venkateswar 2026-07-25 10:20:21 0 95
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com