వేసవి జాగ్రత్తలు తప్పనిసరి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్

0
505

బాపట్ల జిల్లా: జిల్లాలో మార్చి, ఏప్రిల్, మే, నెలల్లో ఎండలు తీవ్రత క్రమేపి పెరగనునుందని, దీనితో పాటు వడగాలులు ప్రభావం కూడా అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ బులెటిన్ లో పేర్కొందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఇక నుంచి మధ్యాహ్న సమయంలో బయటికి వెళ్లాలంటే తప్పకుండా గొడుగులు వెంట తీసుకెళ్లాలన్నారు. తెలుపు రంగు, పలుచటి కాటన్ వస్త్రాలు ధరించడం, కర్చీఫ్ కట్టుకోవడం , టోపి పెట్టుకోవడం, కళ్ళ రక్షణ కోసం నాణ్యమైన సన్ గ్లాసెస్ ఉపయోగించడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలన్నారు. గర్బిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు  వీలైనంత వరకు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలన్నారు. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలి. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

 

#Narendra

Search
Categories
Read More
SURAKSHA
Shri M. Chawla, IPS: A Lifetime of Courage and Public Service
A distinguished IPS officer whose unwavering commitment to ethical policing, crime prevention,...
By Kalaga Sailaja 2026-07-31 14:44:50 0 252
Andhra Pradesh
నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన ప్రదేశాలు, కూడళ్ల వద్ద పికెట్స్ ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది
నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి బహిరంగ ప్రదేశాలలో మద్యం...
By Gadiyapudi Narendra 2025-12-30 17:04:32 0 442
Andhra Pradesh
Nara Lokesh: తెదేపా కార్యకర్తల కోసం లోకేశ్ ప్రత్యేక చొరవ.. రాష్ట్రంలోనే తొలిసారిగా హెల్త్ క్యాంప్.
ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి...
By Pagadala Venkateswar 2026-03-23 06:06:12 0 216
Andhra Pradesh
తాడేప‌ల్లి లోని వైయ‌స్సార్సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా వ‌డ్డె ఓబ‌న్న జ‌యంతి కార్య‌క్ర‌మం.
తాడేప‌ల్లి: గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన వీరుడిగా ఉయ్యాల‌వాడ నర‌సింహారెడ్డికి...
By John Baji 2026-01-12 04:32:34 0 223
Andhra Pradesh
క్రైస్తవులకు అన్యాయం చేస్తున్న దోర్నాల పోలీసులు
*క్రైస్తవులకు అన్యాయం చేస్తున్న దోర్నాల పోలీసులు*   మార్కాపురం జిల్లా దోర్నాల మండలం...
By Chennaiah Kati 2026-06-11 13:20:47 0 181
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com