లక్సట్టిపేట్ లోని ప్రభుత్వ ఆసుపత్రి ని సందర్శించిన ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

0
299

మంచిర్యాల : లక్షెట్టిపేట్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను స్వయంగా పలకరించి వారి ఆరోగ్య పరిస్థితులు, అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు,అనంతరం వైద్యులు, సిబ్బందితో సమావేశమైన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు ఆసుపత్రిలో పరిశుభ్రత, రోగులకు మెరుగైన సేవలు అందించే విషయంలో పలు సూచనలు చేశారు. ఆసుపత్రి పవిత్రతను కాపాడే ఉద్దేశ్యంతో అధికారులు, ప్రజాప్రతినిధులు సహా ఎవరైనా ఆసుపత్రి లోపలికి ప్రవేశించే సమయంలో చెప్పులు బయట విడిచి రావాలని వైద్యులకు సూచించారు,ఈ సందర్భంగా లక్షెట్టిపేట్ మున్సిపాలిటీలో కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులపై కూడా ఎమ్మెల్యే గారు స్పందించారు. పట్టణ అభివృద్ధికి అత్యంత కీలకమైన రోడ్డు వెడల్పు పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని, ఎవరి అడ్డంకులు వచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు,ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట్ మున్సిపల్ కమిషనర్ విజయ్, MRO దిలీప్ , చైర్మన్ దొంత అంజలి - నర్సయ్య , మోత్కూరి రాజేశ్వరి- వెంకటస్వామి గౌడ్ , మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ చంద్, వైస్ చైర్మన్ ఆరీఫ్ , కౌన్సిలర్ల, పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ, జిల్లా RGPRS అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, జిల్లా నాయకులు చల్లా నాగభూషణం , పూర్ణచంద్రరావు , సర్పంచ్లు , ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నరు.

Search
Categories
Read More
SURAKSHA
Deven Bharti IPS: The Strategic Mind Behind Mumbai's Security
The Journey Begins "Effective policing is built on intelligence, public trust,...
By Fathima Safa 2026-07-21 04:33:41 0 168
Mizoram
High-Stakes Northeast Fisheries Meet Commences in Aizawl
Union Minister Rajiv Ranjan (Lalan) Singh arrived in Aizawl today to chair a vital Regional...
By Dunna Jessicaruth 2026-05-25 06:57:28 0 99
Telangana
Breaking News!!!! Hydra works near hitech city
Breaking News!!!! Hydra works happening at hitech city near Sindhu hospital, izzatnagar....
By Terli Ashok 2026-05-08 08:52:56 0 624
Telangana
కరీంనగర్ : తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కుమారుడు...!
కరీంనగర్ పట్టణం ముకురాంపురం ఆరెల్లి మల్లేష్ అనే వ్యక్తి తన తండ్రి ఆరెల్లి నరసయ్య గొడ్డలితో నరికి...
By Sunka Santhosh 2026-05-16 07:27:39 0 169
Andhra Pradesh
పర్యాటకుల సౌకర్యార్థం హ్యాండ్‌పంప్ మరమ్మతు
చీరాల: చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సూచనల మేరకు చల్లారెడ్డిపాలెం పంచాయతీ టీడీపీ పార్టీ...
By Vadlamudi NagaVenkat 2026-09-12 09:25:48 0 82
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com