శాంతి శ్రీనివాస్ రెడ్డి వినతి స్వీకరించిన సంచిత్ గంగ్వార్.|

0
167

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేసి అమలు చేయాలని కోరుతూ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆల్వాల్ డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న బీహెచ్‌ఈఎల్ రోడ్డు అభివృద్ధి పనులు, హరిజన్ బస్తీ శ్మశానవాటిక అభివృద్ధి పనులతో పాటు స్థానిక ప్రజలకు అవసరమైన పలు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల గురించి ఆమె జోనల్ కమిషనర్‌తో చర్చించారు. 

ప్రస్తుతం అనుమతుల కోసం ఎదురుచూస్తున్న ఈ పనులను త్వరితగతిన మంజూరు చేసి పూర్తి చేయాలని ఆమె కోరారు.

స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనుల అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని శాంతి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

దీనిపై జోనల్ కమిషనర్ సానుకూలంగా స్పందించి సంబంధిత అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Nagaland
Dimapur Smart City Project Picks Up Pace with Green Initiatives
Under the Smart Cities Mission, Dimapur is witnessing a wave of transformation. The...
By Bharat Aawaz 2025-07-17 11:08:28 0 1K
Andhra Pradesh
చరిత్ రెడ్డి ఢిల్లీలో మిథున్ రెడ్డితో భేటీ: ఎన్నికల వ్యూహాలపై చర్చ.
రామసముద్రం మండలం వైసీపీ మండల కన్వీనర్ కేశవరెడ్డి తనయుడు, యువ నాయకుడు చరిత్ రెడ్డి ఢిల్లీలో వైసీపీ...
By Pagadala Venkateswar 2026-02-04 07:25:16 0 183
SURAKSHA
Dalton P. Marak IPS: A Resolute Leader in Policing
A Dedicated Officer Known for Strategic Policing, Public Service and Commitment to...
By Lokeshwari Panthadi 2026-07-22 13:00:24 0 179
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: పడాలని గంగమ్మకు గంగాభిషేకం
సోమల మండలం కందూరు గ్రామం బోయవీధిలో ఉండే నడివీధి గంగమ్మకు వర్షాలు పడాలని 1001 బిందెలతో గంగాభిషేకం...
By Kothuru Murali 2026-07-26 14:37:03 0 186
Telangana
వక్ఫ్ సమస్య పరిష్కారానికి చర్యలు వేగవంతం.|
"ప్రభావిత కాలనీలకు త్వరలో ఊరట లభించే సూచనలు" మేడ్చల్ మల్కాజిగిరి జూలై 4: మల్కాజ్‌గిరి...
By Sidhu Maroju 2026-07-04 09:09:42 0 110
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com