తేది:18.06.2026,త్రిపురాంతకం యోగా ఉత్సవాల్లో భాగంగా త్రిపురాంతకం లోని త్రిపురాంతకేశ్వర స్వామి సన్నిధిలో 'పర్యాటక ప్రదేశ యోగా' కార్యక్రమంల

0
152

యోగా ఉత్సవాల్లో భాగంగా త్రిపురాంతకం లోని త్రిపురాంతకేశ్వర స్వామి సన్నిధిలో 'పర్యాటక ప్రదేశ యోగా' కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత గారు, జాయింట్ కలెక్టర్.పి శ్రీనివాసులు గారు, ఎర్రగొండపాలెం తెదేపా ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. వేల సంవత్సరాల క్రితమే భారతదేశం యోగా గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసిందన్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు యోగాను దైనందిక జీవితంలో భాగం చేసుకుంటున్నాయని వివరించారు. ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగ ఉత్తమమైన మార్గమని కలెక్టర్ వివరించారు. ప్రతి ఒక్కరూ దీన్ని పాటించి మెరుగైన జీవన విధానానికి బాటలు వేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా త్రిపురాంతకేశ్వర స్వామి కొండపై కలెక్టర్, అధికారులు మొక్కలు నాటి ప్రజలకు స్ఫూర్తిని అందించారు.

Search
Categories
Read More
Madhya Pradesh
Madhya Pradesh Expands Renewable Energy Infrastructure
Madhya Pradesh continues to accelerate renewable energy development through large-scale solar...
By Fathima Safa 2026-06-30 08:46:05 0 105
Andhra Pradesh
సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన శంకుస్థాపన.
AP: చిత్తూరు జిల్లా నగరిలో సీఎం చంద్రబాబు ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో...
By Pagadala Venkateswar 2026-01-24 10:08:18 0 202
SURAKSHA
Vijay Kiran Anand, IAS: Leading Progress with Excellence
A distinguished 2009-batch Uttar Pradesh Cadre IAS officer, Shri Vijay Kiran Anand serves as the...
By Lokeshwari Panthadi 2026-07-17 13:04:25 0 127
Telangana
ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి -రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
మహబూబాబాద్,డిసెంబర్ 22 (భారత్ అవాజ్):రాష్ట్రంలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేసి త్వరగా...
By Bheeshman King 2025-12-22 12:55:24 0 337
Andhra Pradesh
లెఫ్ట్ పార్టీస్ ప్రెస్ స్టేట్మెంట్
వామపక్ష పార్టీలు ప్రచురణార్ధం/ప్రసారార్ధం :          విజయవాడ, తేది :...
By Rajini Kumari 2025-12-18 11:40:16 0 247
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com