కృష్ణలంక సాయి కృష్ణ అదృశ్యం కేసు.. డీజీపీకి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.

0
106

 

కృష్ణలంక సాయి కృష్ణ అదృశ్యం కేసు.. డీజీపీకి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

18-06-2026 Thu 06:09

Andhra

Krishnalanka Sai Krishna disappearance case CM Chandrababu key orders to DGP

సాయికృష్ణ అదృశ్యం కేసులో కృష్ణలంక సీఐ సస్పెండ్

ఉన్నతస్థాయి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం

సీనియర్ ఐపీఎస్ అధికారితో దర్యాప్తు జరపాలని సూచన

పోలీసుల అదుపు తర్వాతే సాయికృష్ణ కనపడలేదంటున్న కుటుంబం

జూన్ 29 లోగా హాజరుపరచాలని హైకోర్టు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేకెత్తించిన విజయవాడ కృష్ణలంక యువకుడు గాదె సాయికృష్ణ అదృశ్యం కేసును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా పరిగణించారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) నాగరాజును తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన ఆదేశించారు. ఈ ఘటనపై సీనియర్ ఐపీఎస్ అధికారితో ఉన్నతస్థాయిలో నిష్పక్షపాత విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

 

బుధవారం సింగపూర్ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్ర లడ్డా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సాయికృష్ణ అదృశ్యం కేసుపై లోతుగా చర్చించి, ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు.

 

విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణపై గతంలో కొన్ని నేరారోపణలు ఉన్నాయి. అయితే, మే 9న మార్కాపురంలో కృష్ణలంక పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారని, అప్పటి నుంచి ఆచూకీ తెలియడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడి ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, జూన్ 29లోగా సాయికృష్ణను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది.

 

ఈ కేసు నేపథ్యంలో ఇప్పటికే సీఐ నాగరాజును వీఆర్‌కు బదిలీ చేయగా, తాజాగా ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది.

 

Search
Categories
Read More
Telangana
కూకట్‌పల్లి అభివృద్ధి పనులపై మేడ్చల్ కలెక్టర్ సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కీలక సూచనలు
మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం (18-05-2026) నిర్వహించిన జిల్లా స్థాయి విస్తృత...
By Jagadeesh Babu 2026-05-18 16:48:18 0 905
Telangana
కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కుట్రలకు గట్టి చెంపపెట్టు
ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు స్టే ఇవ్వడంతో , ‎ఈ రాజకీయ కక్షసాధింపు చర్యకు ఎదురు దెబ్బ...
By Ponnala Srinivasrao 2026-04-23 00:40:18 0 150
Andhra Pradesh
బొలెరో ఢీకొని ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు.
సోమవారం ములకలచెరువు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురానికి చెందిన భాను ప్రకాశ్ (24),...
By Pagadala Venkateswar 2026-05-19 05:12:52 0 109
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గ:చౌడేపల్లిలో గంగమ్మ జాతర దీపాల వెలుగుల్లో ఆధ్యాత్మిక శోభ
చౌడేపల్లి పట్టణంలో గంగమ్మ జాతర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామం మొత్తం దీపాలతో అలంకరించి...
By Kothuru Murali 2026-04-08 09:32:31 0 158
BMA
Media Demands PM Address Unscripted Press Briefings
The Editors Guild of India recently issued a sharp condemnation of attempts by officials to...
By JoinBMA 2026-09-10 04:52:01 0 133
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com