చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. మాంసం నింపిన బొమ్మలతో కొత్త ఎత్తుగడ!.

0
113

 

చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. మాంసం నింపిన బొమ్మలతో కొత్త ఎత్తుగడ!

 

Andhra

Sunkara Gnaneswari missing case new strategy with meat filled dolls

కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కొనసాగుతున్న గాలింపు

వన్యమృగాల కదలికల కోసం మాంసం నింపిన బొమ్మలు ఏర్పాటు చేసిన అధికారులు

పాపతో పాటు వెళ్లిన పెంపుడు కుక్క అనుమానాస్పదంగా మృతి

రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు.. డ్రోన్లతో జల్లెడ

ఆచూకీ చెప్పిన వారికి రూ. లక్ష రివార్డు ప్రకటన

కాకినాడ జిల్లాలోని పామాయిల్ తోటలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ పది రోజులు దాటినా లభించలేదు. దీంతో గాలింపు చర్యలను ముమ్మరం చేసిన అధికారులు, వన్యమృగాల ఉనికిని గుర్తించేందుకు ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. పాప తప్పిపోయిన ప్రాంతంలో ఇనుప బోనును ఏర్పాటు చేసి, అందులో చిన్నారిని పోలిన రెండు బొమ్మలను ఉంచారు. ఆ బొమ్మల్లో మాంసం ముక్కలను పెట్టి, జంతువులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. వాటి కదలికలను పసిగట్టేందుకు సమీపంలో కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేసి నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

 

చిన్నారిని ఏదైనా వన్యమృగం ఎత్తుకెళ్లి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నప్పటికీ, దానికి సంబంధించిన ఆధారాలేవీ ఇప్పటివరకు లభించలేదు. సుమారు 400 మందికి పైగా పోలీసు, అటవీ శాఖ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత ఆదేశాల మేరకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) కూడా రంగంలోకి దిగింది. థర్మల్ డ్రోన్లతో సైతం ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.

 

ఈ కేసులో మిస్టరీని మరింత పెంచుతూ, పాపతో పాటు అదృశ్యమైన పెంపుడు కుక్క జూన్ 13న మృతి చెందింది. జూన్ 9న ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చిన ఈ కుక్క, అప్పటి నుంచి ఆహారం తీసుకోకుండా వింతగా ప్రవర్తించింది. దీనికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. సుమారు 80 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఇంటికి చేరిన ఈ కుక్క, వైరల్ ఇన్ఫెక్షన్ సోకి మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు.

 

జూన్ 6న తుని మండలం సిహెచ్. అగ్రహారంలో తల్లిదండ్రులు గణేష్, భవానితో కలిసి పామాయిల్ తోటకు వెళ్లిన జ్ఞానేశ్వరి అదృశ్యమైంది. తల్లిదండ్రుల మధ్య సమన్వయ లోపం కారణంగానే పాప తప్పిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. పాప ఆచూకీ తెలిపిన వారికి జిల్లా యంత్రాంగం రూ.లక్ష రివార్డును ప్రకటించింది.

Search
Categories
Read More
Andhra Pradesh
బద్వీడు అభివృద్ధి-NDN కూటమితో సరికొత్త మార్గం
బద్వీడు అభివృద్ధి – NDA కూటమితో సరికొత్త మార్గం!”   పెద్దారవీడు మండలం...
By Chennaiah Kati 2026-01-15 07:10:10 0 296
SURAKSHA
Devesh Kumar: Driving Himachal's Vision for Progress
A distinguished 1998-batch IAS officer of the Himachal Pradesh cadre, recognized for his...
By Lokeshwari Panthadi 2026-07-24 09:28:16 0 253
Andhra Pradesh
సారా విక్రయం కేసులో నిందితుడికి రిమాండ్
సారా విక్రయం కేసులో నిందితుడైన సామర్లకోట పట్టణంలోని కుమ్మర వీధికి చెందిన గుబ్బల వీర ఆదివిష్ణువును...
By Ratna Sekhar 2026-03-11 07:46:49 0 2K
Telangana
మల్కాజ్ గిరి లో నూతన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ప్రారంభం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి ఆర్‌.కే.నగర్, శ్రీ పంచమి హోటల్ సమీపంలో...
By Sidhu Maroju 2025-11-24 10:37:35 0 244
Andhra Pradesh
ఎస్‌ఐఆర్‌లో పాల్గొన్న బాలమాలి శేఖర్.
మదనపల్లె పట్టణంలోని 34వ వార్డులో ఆదివారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో టీడీపీ 34వ...
By Pagadala Venkateswar 2026-07-14 06:54:34 0 94
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com