'దిశ' ఫెయిల్.. 'శక్తి' సక్సెస్: అనిత.

0
117

 

'దిశ' ఫెయిల్.. 'శక్తి' సక్సెస్: అనిత

16-06-2026 Tue 

Andhra

Crime rate in AP decreased says Anitha

ఏపీలో క్రైం రేటు 14.1 శాతం తగ్గిందన్న అనిత

గత ప్రభుత్వ హయాంలో దిశ చట్టం అమలు కాలేదని విమర్శ

ఇప్పటి వరకు 2,366 గంజాయి కేసులు నమోదు చేశామని వెల్లడి

ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు, పరిశ్రమలు రావాలంటే అక్కడ శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉండాలని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వ పోలీసింగ్ తీరుపై ఆమె పూర్తి స్థాయి రిపోర్ట్ కార్డ్‌ను బయటపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో 'దిశ' చట్టం అమలు కాలేదని విమర్శిస్తూ.. తమ హయాంలో క్రైం రేట్ గణనీయంగా తగ్గిందని లెక్కలతో సహా వివరించారు.

 

 

 

ఏపీలో క్రైం రేటు 14.1 శాతం తగ్గిందని హోంమంత్రి వెల్లడించారు. సీసీటీవీలు, డ్రోన్ టెక్నాలజీ వాడకం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష సీసీ కెమెరాల టార్గెట్ పెట్టుకోగా, ఇప్పటికే 70 శాతం పూర్తి చేశామని, నేరం జరిగిన 24 గంటల్లోనే నిందితులను పట్టుకుంటున్నామని చెప్పారు.

 

 

మహిళలపై నేరాల్లో 6.9 శాతం తగ్గుదల నమోదైందని తెలిపారు. తాము ఐజీ స్థాయి అధికారితో 'శక్తి యాప్' తెచ్చామని, దీనిని 1.5 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. లైంగిక నేరాల దర్యాప్తు నాణ్యత 31 శాతం నుంచి ఏకంగా 90 శాతానికి పెరిగిందని, 591 మందికి శిక్షలు పడ్డాయని వివరించారు.

 

 

'ఈగల్ టీమ్' ద్వారా నార్కోటిక్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని, ఏపీ మోడల్‌ను తెలంగాణ కూడా అనుసరిస్తుండడం మనకు గర్వకారణమన్నారు. ఇప్పటివరకు 2,366 గంజాయి కేసులు నమోదు చేసి, 986 మందిని అరెస్ట్ చేశామన్నారు. అలాగే సైబర్ క్రైమ్స్ కోసం ప్రత్యేక 'వార్ రూమ్' ఏర్పాటు చేస్తున్నామని, రూ. 247 కోట్ల సైబర్ ఫ్రాడ్ మనీని ఫ్రీజ్ చేయడంతో పాటు 8 వేలకు పైగా ఇల్లీగల్ ఆన్‌లైన్ కంటెంట్‌ను తొలగించామని స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఉక్కు కార్మికులకు జగన్ క్షమాపణ చెప్పాల్సిందే: లోకేశ్
విశాఖ ఉక్కు కార్మికులకు YS జగన్ క్షమాపణ చెప్పాలని మంత్రి లోకేశ్ డిమాండ్ చేశారు. 'స్టీల్ ప్లాంటును...
By Boiena Rajesh 2026-06-10 09:48:15 0 223
Telangana
ఆసిఫాబాద్ జ్యోతిబాఫులే పాఠశాలను సందర్శించిన మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఇరుకుల మంగ
ఆసిఫాబాద్, జూలై 02: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జ్యోతిబాఫులే గురుకుల పాఠశాలను...
By Chunarkar Jagadeesh 2026-07-02 14:38:21 0 274
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:34:32 0 105
SURAKSHA
Peeyush Pandey IPS: Securing Bengal with Excellence
A 1993-batch West Bengal cadre officer whose career spans security leadership, police...
By Lokeshwari Panthadi 2026-07-28 11:45:10 0 116
Dadra &Nager Haveli, Daman &Diu
New Minimum Wage Policy: A Milestone for DNHDD Workers
Effective July 1, 2026, the administration of Dadra & Nagar Haveli and Daman & Diu has...
By Lokeshwari Panthadi 2026-07-01 04:58:35 0 89
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com