"విద్యుత్ ఘాతంతో మరణించిన బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి."|

0
138

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్ పరిధిలో ఇటీవల టెలికాం కాలనీలో చోటుచేసుకున్న ఘోర విద్యుత్ ప్రమాదంలో చిక్కుకుని మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ పరామర్శించారు.

బాధిత కుటుంబ సభ్యులను కలిసి ఆయన వారిని ఓదార్చారు. ఈ కష్టసమయంలో వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

ప్రభుత్వ విద్యుత్ శాఖ నుండి బాధితులకు తగిన నష్టపరిహారం త్వరగా అందేలా తన వంతుగా పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని ఆయన స్పష్టం చేశారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు స్థానిక బిఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, దేవయ్య, రాజు, విజయ్ శేఖర్, జనార్దన్, ప్రకాష్ గౌడ్, మైవన్, మురళి గౌడ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని మృతుని కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు.

#Sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Telangana
"ఆదర్శ్ నగర్ మైసమ్మ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు”.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్ ఆదర్శ్ నగర్‌లోని మైసమ్మ ఆలయంలో భక్తి వాతావరణం నడుమ...
By Sidhu Maroju 2026-04-01 17:18:38 0 234
Health & Fitness
Smart E-Bike Tech Wins Digital Prize at Eurobike 2026
Avinox has secured the prestigious 2026 Eurobike Award in the Digital Solutions category for its...
By Lokeshwari Panthadi 2026-06-27 04:56:23 0 98
Telangana
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి మరొకరి పరిస్థితి విషమం
టాక్టర్ ను డీకొన్న బైక్ ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సూర్యాపేట జిల్లా...
By Mahankali Ravi 2026-04-21 14:16:49 0 431
Andhra Pradesh
గన్నవరం విమానాశ్రయం నుండి వెళ్లిన హజ్ యాత్ర వెళ్లిన 720 మందికి సబ్సిడీ వేయాలి
2024వ సంవత్సరం లో గన్నవరం విమానాశ్రయం నుండి వెళ్లిన హజ్ యాత్రకు వెళ్లిన. 720 మందికి. సబ్సిడీ...
By Rajini Kumari 2025-12-23 10:35:39 0 236
Andhra Pradesh
కోడి రామ్మూర్తి స్టేడియం పనుల వేగవంతం
శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గారు కోడి రామ్మూర్తి స్టేడియం అభివృద్ధి పనులను శుక్రవారం స్వయంగా...
By Manda Ramkumar 2026-03-27 13:04:14 0 267
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com