విద్యా ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

0
358

శాయంపేట మండలంలో విద్యా ప్రారంభోత్సవం కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు.అనంతరం గోవిందాపూర్ సమీపంలో గల కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో అదనపు మరుగుదొడ్లు, స్నానపు గదుల మరియు ఇతర మౌళిక వసతులకోసం చేపట్టబోయే పనులకు ఎమ్మెల్యే గండ్ర శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్యా, వైద్యం, అనువైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం ఎల్లవేళలా పాటుబడుతుందని అని ,గురుకుల పాఠశాలల విద్యార్థులకు గతంలో లేని విధంగా మెస్ ఛార్జీలు పెంచి,వారి వ్యక్తిగత పరిశుభ్రత కోసం కాస్మొటిక్ చార్జీలను గణనీయంగా పెంచి వారి ఖాతాలోనే వేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు.38 లక్షల రూపాయలతో విద్యాలయంలో అధునాతన సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలు, దుప్పట్లు పంపిణీ చేసి,క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని సూచిస్తూ,విద్యతోనే ఉన్నత భవిష్యత్తు సాధ్యమవుతుందని , ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు,నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఆలయ సందర్శన మరియు సరస్వతి హోమం కార్యక్రమంలో పాల్గొన్న...
By Rajini Kumari 2026-01-23 12:15:18 0 410
Telangana
మృతిని కుటుంబానికి ఆర్థిక సహాయం
రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి తాలూకా తలకొండపల్లి గ్రామపంచాయతి బద్నాపూర్ గ్రామం లో తోటపల్లి జంగయ్య...
By MERIGE MALLESH 2026-03-26 05:36:46 0 415
Andhra Pradesh
తాజా వాతావరణ వివరాలు ఏపీలో చలి తీవ్రత
*ఏపీలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. పగటిపూట ఎండ ఉన్నప్పటికీ, రాత్రి మరియు తెల్లవారుజామున...
By Rajini Kumari 2025-12-18 08:11:37 0 250
Andhra Pradesh
తిరుమలలో మళ్లీ చిరుత కలకలం: జీఎన్సీ టోల్‌గేట్ నడకదారి సమీపంలో సంచారం.
  నిన్న అర్ధరాత్రి జీఎన్సీ టోల్‌గేట్‌ సమీపంలో ప్రత్యక్షమైన చిరుత వెంటనే...
By Pagadala Venkateswar 2026-09-14 10:45:07 0 83
SURAKSHA
TN Police Today: Fighting Social Evils With Courage
Today TN police officers fought against social evils across state. Village meetings held against...
By Kalaga Sailaja 2026-07-04 08:09:57 0 76
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com