"సికింద్రాబాద్‌లో 17 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు పట్టివేత.|

0
129

సికింద్రాబాద్ : సికింద్రాబాద్‌లోని దేవకి లాడ్జ్‌లో గోపాలపురం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు జూన్ 14న ప్రత్యేక బృందం క్లూస్ టీమ్, స్వతంత్ర సాక్షులతో కలిసి దేవకి లాడ్జ్‌లో సోదాలు నిర్వహించింది. 

ఈ సందర్భంగా బీహార్‌కు చెందిన రిషి కుమార్ (23)తో పాటు 17 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకుని వారి సామాను తనిఖీ చేయగా, 13 ప్యాకెట్లలో ఉన్న 17 కిలోల గంజాయి లభ్యమైంది.

విచారణలో నిందితులు ఒడిశాలోని సంబల్‌పూర్ నుంచి మహారాష్ట్రలోని పూణేకు హైదరాబాద్ మీదుగా గంజాయిని తరలిస్తున్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ వ్యవహారంలో ప్రధాన సరఫరాదారుగా భావిస్తున్న బీహార్‌కు చెందిన విజయ్ అలియాస్ సంభవ్ కుమార్ పరారీలో ఉన్నట్లు గుర్తించారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

గంజాయితో పాటు నిందితులు ఉపయోగిస్తున్న రెండు మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాల రవాణా వెనుక ఉన్న ఇతర వ్యక్తుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది.

మల్కాజిగిరి జోన్ డీసీపీ C. శ్రీధర్ , ఏసీపీ యాదగిరి రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న గోపాలపురం పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Puducherry
Puducherry Boosts Sustainable Coastal Eco-Tourism Growth
Puducherry is strengthening its position as a sustainable tourism destination by promoting...
By Fathima Safa 2026-06-29 08:22:40 0 161
Telangana
ఈ నెల 12వ తేదీన మంచిర్యాల జిల్లా పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఈ నెల 12వ తేదీన మంచిర్యాల జిల్లా పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.   ఈ...
By Pinnehasan Odela 2026-04-10 11:48:53 0 279
Telangana
హైటెక్ సిటీలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు.|
"శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమం." హైదరాబాద్ : హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో నేడు...
By Sidhu Maroju 2026-06-30 09:22:05 0 125
Uttar Pradesh
UP Schools Nominated for World’s Best School Prizes
In a moment of immense pride for Uttar Pradesh, two prominent institutions—the "Healthy...
By Lokeshwari Panthadi 2026-06-30 07:12:50 0 82
SURAKSHA
Karnataka Cops Today: Mentors For Future Officers
oday senior and retired Karnataka police officers mentored new recruits. At training centers,...
By Kalaga Sailaja 2026-07-04 06:50:57 0 106
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com